Pattabhi: ఎవరికి దోచిపెట్టావో లెక్క చెప్పు పెద్దిరెడ్డి... లేకపోతే
ABN, First Publish Date - 2023-02-14T15:12:39+05:30
విద్యుత్ డిస్కంల అప్పును జగన్ ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో రికార్డు స్థాయిలో రూ.50 వేల కోట్లక చేర్చిందని టీడీపీ నేత పట్టాభి అన్నారు.
అమరావతి: విద్యుత్ డిస్కంల అప్పు (Debt of Electricity Discs)ను జగన్ ప్రభుత్వం (Jagana Government) గత మూడున్నరేళ్లలో రికార్డు స్థాయిలో రూ.50 వేల కోట్లక చేర్చిందని టీడీపీ నేత పట్టాభి (TDP Leader Pattabhi) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. 2018-19లో కేవలం రూ.18,022 కోట్లుగా ఉన్న డిస్కంల మొత్తం 2022 డిసెంబర్ నాటికి ఆందోళనకరంగా రూ.50,004 కోట్లకు చేరిందన్నారు. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) హయాంలో 2014-19 ఐదేళ్ల కాలంలో డిస్కంల అప్పు కేవలం రూ.4,188 కోట్లు పెరిగితే నేడు జగన్ (AP CM YS Jaganamohan Reddy)హయంలో మూడున్నరేళ్లలోనే రూ.31,981 కోట్లు పెరిగిందని తెలిపారు. 2014-15లో టీడీపీ (TDP) హయంలో డిస్కంల అప్పు రూ.13,834 కోట్లు ఉండగా... అది 2018-19 నాటికి కేవలం రూ.18,022 కోట్లకు మాత్రమే చేరుకుందని వెల్లడించారు. కానీ.. వైసీపీ (YCP) హయంలో ఆ అప్పు కాస్తా 2022 డిసెంబర్ నాటికి రూ.50,004 కోట్లకు చేరి ప్రపంచ రికార్డు సృష్టించిందని ఆయన వ్యాఖ్యలు చేశారు.
అంటే ఐదేళ్ల చంద్రబాబు (TDP Chief) పాలనలో కేవలం 30 శాతం డిస్కంల అప్పు పెరిగితే జగన్ రెడ్డి (AP CM Jagan Reddy) పాలనలో డిసెంబర్, 2022 నాటికి 177 శాతం అప్పు పెరిగిందన్నారు. టీడీపీ హయాంలో పైసా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా 24/7 నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తే నేడు ఈ సైకో జగన్ రెడ్డి ఇప్పటికి ఏడుసార్లు ఛార్జీలు పెంచి రూ. 17 వేలకోట్ల భారాన్ని ప్రజలపై మోపారని విమర్శించారు. ఒక్క యూనిట్ అదనంగా విద్యుత్ ఉత్పాదన పెంచకుంటా నిరంతరం కోతలతో ప్రజలను వేధిస్తూ తీసుకొచ్చిన ఈ రూ.50 వేల కోట్లను దేనికి ఖర్చు చేశావో జవాబు చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Minister Peddi Reddy Ramachandra Reddy)ని ప్రశ్నించారు. సరాసరిన ఏడాదికి రూ.9,137 కోట్లు, నెలకు రూ.837 కోట్లు విచ్చలవిడిగా డిస్కంల పేరుతో అప్పు చేసి ఎవడికి దోచిపెట్టావో లెక్క చెప్పు పెద్దిరెడ్డి అని నిలదీశారు. ‘‘నువ్వు నోరు విప్పకపోతే ఎవరెవరు బినామీలకు ఎంతెంత దోచిపెడుతున్నావో త్వరలో ప్రజల ముందు ఉంచుతా’’ అంటూ పట్టాభి హెచ్చరించారు. ..
Updated Date - 2023-02-14T15:12:41+05:30 IST