ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Varla Ramaiah: ‘తాడేపల్లిలో సీఎం నివాసం, డీజీపీ ఆఫీసులు ఉన్నప్పటికీ...’

ABN, First Publish Date - 2023-02-16T11:39:24+05:30

తాడేపల్లి క్రైం హబ్‌గా మారిపోయిందని టీడీపీ నేత వర్ల రామయ్య వ్యాఖ్యలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: తాడేపల్లి క్రైం హబ్‌గా మారిపోయిందని టీడీపీ నేత వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) వ్యాఖ్యలు చేశారు. తాడేపల్లి దివ్యాంగురాలు ఎస్తేర్ రాణి హత్య (Tadepalli disabled woman Estar Rani Case) పై గురువారం ఉదయం నేషనల్ ఎస్సీ కమీషన్‌ (National SC Commission)లో వర్ల రామయ్య (Varla Ramaiah) ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... తాడేపల్లిలో సీఎం నివాసం, డీజీపీ ఆఫీసులు ఉన్నప్పటికీ మహిళల (Womens)కు రక్షణ కరువయ్యిందన్నారు. డ్రగ్స్‌ (Drugs)తో ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతున్నప్పటికీ పోలీసులు (Police)నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల ఉదాసీన వైఖరితో తాడేపల్లిలో గతంలో అనేక దారుణమైన సంఘటనలు జరిగాయన్నారు. ఫిబ్రవరి 12న దివ్యాంగురాలు ఎస్తేర్ రాణిని నిందితుడు చిత్రహింసలకు గురిచేశారని తెలిపారు. బాధితురాలి తల్లి నిందితుడి తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడం జరిగిందని... ఇంతలోనే దివ్యాంగురాలిపై రాజు దాడిచేసి తలపై కత్తితో నరికాడన్నారు. హాస్పిటల్‌కు తీసుకెళ్లే క్రమంలో దివ్యాంగురాలు మృతిచెందిందని తెలిపారు. నిందితుడు రాజు నేరచరిత్ర ఉన్నవాడని... పోలీసుల ఉదాసీన వైఖరే దివ్యాంగురాలి హత్యకు కారణమని ఆయన ఆరోపించారు.

నిందితుడు రాజు డ్రగ్స్‌కు బానిసైనట్లు తెలుస్తోందన్నారు. డ్రగ్స్ దందాపై అనేక మార్లు ఫిర్యాదులు చేసినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. దివ్యాంగురాలిని అత్యంత దారుణంగా హతమార్చిన రాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం డ్రగ్స్ నిషేధంపై చర్యలు తీసుకునేలా కమీషన్ ఆదేశించాలన్నారు. డ్రగ్స్ ప్రభావంతో మహిళలపై జరిగిన నేరాలపై సమగ్ర విచారణ చేయించాలని కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను ఖూనీ చేస్తూ తప్పుడు మార్గంలో నడుస్తున్న పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించేలా చర్యలు తీసుకోవాలని నేషనల్ ఎస్సీ కమీషన్‌‌కు వర్ల రామయ్య వినతి చేశారు.

Updated Date - 2023-02-16T11:39:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising