ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Varla Ramaiah: పొన్నవోలుకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లిస్తాం

ABN, First Publish Date - 2023-11-22T17:24:55+05:30

పొన్నవోలుకు దమ్మంటే స్కిల్ కేసులో ‘‘సీక్రెట్ అకౌంట్స్’’ కు డబ్బులు దారి మళ్లాయని నిరూపించగలరా? ధైర్యముంటే ఈ విషయంలో నాతో బహిరంగ చర్చకు సిద్దమా?

అమరావతి: అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యవహారశైలి న్యాయవాద వృత్తికే కళంకం తెస్తుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (Varla Ramaiah) ఆరోపించారు. వర్ల రామయ్య మీడియాతో మాట్లాడారు. ‘‘ఏ అడ్వకేట్ జనరల్ కూడా ఇంత బహిరంగంగా ప్రెస్‌మీట్లు పెట్టి న్యాయస్థానాన్ని నిందించలేదు. తనకీ పదవిచ్చిన జగన్ కళ్లల్లో ఆనందం చూడాలని పొన్నవోలు తన పరిధి దాటి మాట్లాడుతున్నారు. తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తులను ఏకవచనంతో సంబోధించడం పొన్నవోలు అహంకారానికి నిదర్శనం. స్కిల్ కేసులో నిధులు దారి మళ్లినట్టు సాక్ష్యాలు లేవని న్యాయమూర్తి అంటే.. ఆయనను నిందించే వ్యాఖ్యలు చేయడం సబబా?, పొన్నవోలు లక్ష్యం న్యాయం, సత్యం, ధర్మం కాదు. చంద్రబాబుకి (Chandrababu) శిక్ష పడేలా చేయడమే అతని ఏకైక లక్ష్యం.’’ అని చెప్పుకొచ్చారు.

‘‘పొన్నవోలుకు దమ్మంటే స్కిల్ కేసులో ‘‘సీక్రెట్ అకౌంట్స్’’ కు డబ్బులు దారి మళ్లాయని నిరూపించగలరా? ధైర్యముంటే ఈ విషయంలో నాతో బహిరంగ చర్చకు సిద్దమా?, జాతీయ సంపదలాంటి చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జగన్ కళ్లల్లో ఆనందం చూడాలన్న తాపత్రయం పొన్నవోలుది. పొన్నవోలు వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని చీఫ్ సెక్రెటరీ జవహర్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తున్నాం. చట్ట పరిధి దాటి వ్యవహరిస్తున్న పొన్నవోలుకు భవిష్యత్తులో చట్టబద్దంగానే తగిన మూల్యం చెల్లిస్తాం.’’ అని వర్ల రామయ్య హెచ్చరించారు.

Updated Date - 2023-11-22T17:57:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising