ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vijayawada: ఐదుకు బదులు రెండే.. విజయవాడ వాళ్లకు ఈ విషయం తెలిస్తే..

ABN, First Publish Date - 2023-09-01T21:49:06+05:30

వర్షాకాలంలో ఎండాకాలాన్ని ఎప్పుడైనా చూశారా? ప్రస్తుతం విజయవాడలో వాతావరణం అలాంటి అనుభూతినే ఇస్తోంది. నైరుతి ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించి నెలలు గడుస్తున్నా అడపాదడపా కురుస్తున్న చిరుజల్లులు మినహా వాతావరణం చల్లబడింది లేదు. ఇక ఎండలైతే వేసవిని తలపిస్తున్నాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

(ఆంధ్రజ్యోతి-విజయవాడ): విజయవాడ నగరంలో గడిచిన మూడు రోజులుగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేసవి మాదిరిగానే ఏసీల వినియోగం పెరిగింది. విజయవాడలో గురువారం కనిష్ఠ ఉష్ణోగ్రత 26.6 డిగ్రీలు ఉండగా, గరిష్ఠ ఉష్ణోగ్రత 35.8 డిగ్రీలుగా నమోదైంది. బుధవారం గరిష్ఠం 34 డిగ్రీలుగా ఉంది. ఇక సెప్టెంబరు రెండు, మూడు తేదీల్లో వాతావరణం కూడా ఇలాగే వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.


ఐదుకు బదులు రెండే..

జూన్‌లో నైరుతి రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాలను తాకుతాయి. ఆ సమయంలో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ఈ ఏడాది నైరుతి ఉమ్మడి కృష్ణాజిల్లాను జూన్‌ నెలాఖరున తాకింది. అయినా పెద్దగా వర్షాలు కురవలేదు. దీనికి ఎల్‌నినో ప్రధాన కారణమని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. వర్షాలు కురవాలంటే రుతుపవనాలతో పాటు అల్పపీడన ద్రోణులు చాలా అవసరం. అప్పుడే వర్షాలు విస్తారంగా కురుస్తాయి. ఆగస్టులో బంగాళాఖాతంలో ఐదు అల్పపీడన ద్రోణులు ఏర్పడాలి. ఈ ఏడాది మాత్రం ఆ లెక్క తప్పిందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆగస్టులో రెండు అల్పపీడన ద్రోణులు మాత్రమే ఏర్పడ్డాయి. ఈ కారణంగానే కొద్దిరోజుల క్రితం వర్షాలు కురిశాయి. ఎల్‌నినో ప్రభావంతో వాతావరణంలోని అన్ని సైకిళ్లు క్రమం తప్పాయని అధికారులు చెబుతున్నారు.

‘పసిఫిక్‌’ పయనమేదీ?

నైరుతి రుతుపవనాలు దక్షిణాది రాష్ట్రాలను తాకడం మొదలైన తర్వాత బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణులు మొదలవుతాయి. అలాగే, పసిఫిక్‌ మహాసముద్రం నుంచి కొన్ని అల్పపీడన ద్రోణులు పుట్టుకొస్తాయి. ఆ ప్రభావం దక్షిణాదిపై పడుతుంది. ఈసారి పసిఫిక్‌ మహాసముద్రంలో ఎలాంటి అల్పపీడన ద్రోణులు ఏర్పడలేదు. ఒకవేళ ఏర్పడితే ఆ గాలులు దక్షిణాది రాష్ట్రాలవైపు వీస్తాయి. ఈ ఏడాది ఈ సైకిల్‌లో ఎలాంటి కదలికలు కనిపించలేదు. మరోపక్క సముద్ర గర్భంలో వేడి పెరుగుతోంది. వాస్తవానికి అక్టోబరులో ఉత్తర, తూర్పు మాన్‌సూన్‌ ఉంటుంది. అంటే ఈశాన్య రుతుపవనాలు బయల్దేరతాయి. ఈ సైకిల్‌ అయినా క్రమంగా నడుస్తుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. హిమాలయాల నుంచి వచ్చే మాన్‌సూన్‌ ట్రంఫ్‌ ఉండాల్సిన స్థితిని మార్చుకుంది. ఇది దక్షిణ, ఉత్తర దిశల్లో సాధారణ స్థితిలో ఉండాలి. ఈ స్థితిలో కాకుండా ఇంకా ఎత్తులో ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేశారు. వాతావరణంలో మార్పులకు ఇదొక కారణమని చెబుతున్నారు. ఈ మాన్‌సూన్‌ ట్రంఫ్‌ సాధారణ స్థితిలోకి వస్తే వాతావరణం చల్లబడుతుందని అంటున్నారు.

సెప్టెంబరు 2 తర్వాతే చాన్స్‌

ప్రస్తుతం ఎలినినో ప్రభావం ఉండటంతో వర్షాలు అంతంతమాత్రంగానే కురుస్తున్నాయి. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. సెప్టెంబరు రెండో తేదీ తర్వాత నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఎల్‌నినోతో పాటు వాతావరణంలోని అన్ని సైకిల్స్‌ క్రమం తప్పడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది.

- స్టెల్లా, వాతావరణ శాఖ డైరెక్టర్‌

Updated Date - 2023-09-01T21:50:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising