Durgamma Temple: దుర్గగుడి నూతన ఈవోగా బాధ్యతలు చేపట్టిన కేఎస్ రామారావు
ABN, First Publish Date - 2023-10-11T11:24:24+05:30
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ నూతన ఈవోగా కేఎస్ రామారావు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం కనకదుర్గమ్మ సన్నిధిలో నూతన ఈవోగా రామారావు చార్జి తీసుకున్నారు.
విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ నూతన ఈవోగా కేఎస్ రామారావు బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ఉదయం కనకదుర్గమ్మ సన్నిధిలో నూతన ఈవోగా రామారావు చార్జి తీసుకున్నారు. ఈ సందర్భంగా గత ఈఓ భ్రమరాంబకు గౌరవ మర్యాదలతో నూతన ఈవో వీడ్కోలు పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం రామారావు మాట్లాడుతూ.. దసరా ఉత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు. గత ఈవో స్థిరమైన విధానాల వలన దసరా నిర్వహణ తేలికగా ఉంటుందని నూతన ఈఓ కేఎస్ రామారావు పేర్కొన్నారు.
కాగా.. అక్టోబర్ 1న దుర్గుగడి ఈవో భ్రమరాంబను బదిలీ చేసిన ప్రభుత్వం.. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి ఎం.శ్రీనివాస్‌ను ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆయన విధుల్లో చేరకపోవడంతో కేఎస్ రామారావును దుర్గగుడి నూతన ఈవోగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తక్షణమే దుర్గుగుడి ఈవోగా బాధ్యతలు చేపట్టాలని సర్కార్ ఆదేశించింది. శ్రీకాళహస్తి ఆర్డీవోగా పనిచేస్తోన్న కేఎస్ రామారావును దుర్గగుడి ఈవోగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
Updated Date - 2023-10-11T11:24:24+05:30 IST