కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Chandrababu: అన్నదాతల ఆత్మహత్యలపై చంద్రబాబు ఆవేదన..

ABN, First Publish Date - 2023-08-20T10:26:49+05:30

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ఒక్క రోజులో నలుగురు అన్నదాతల ఆత్మహత్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.

Chandrababu: అన్నదాతల ఆత్మహత్యలపై చంద్రబాబు ఆవేదన..

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి కర్నూలు జిల్లాలో రైతుల ఆత్మహత్యలు (Farmer Suicides) పెరుగుతున్నాయి. ఒక్క రోజులో నలుగురు అన్నదాతల ఆత్మహత్యలపై టీడీపీ అధినేత (TDP Chief) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, ఏపీలో ఏ ప్రాంతంలో పర్యటనకు వెళ్లినా రైతు కష్టాలు, రైతాంగ సమస్యలు కనిపిస్తున్నాయన్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4 గురు రైతులు బలవన్మరణాలు పొందడం ఆవేదన కలిగించిందన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఈ ఘటనతో అర్థమవుతుందన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సాగుకు సబ్సిడీలు, పంటలకు గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతుకు ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. నలుగురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనను ప్రభుత్వం తీవ్ర అంశంగా పరిగణించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకే రోజు నలుగురు రైతులు బలవన్మరనం చెందారు. అవుకు మండలం, కునుకుంట్లలో నాగేష్ (23)అనే యువరైతు, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. నందవరం మండలం, గురజాలకు చెందిన కురువ బీరప్ప (33) అనే రైతు పురుగుల మందు తాగి సూసైడ్ చేసుకున్నాడు. డోన్ మండలం, కొచ్చెర్వుకు చెందిన రైతు శివకుమార్ (31) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సి. బెలగల్ మండలం, ఇనగండ్లకు చెందిన శ్రీకృష్ణ దేవరాయ (52) పొలం దగ్గర ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆయా ప్రాంతాలకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2023-08-20T10:26:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising