ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఇన్విజిలేటర్ డా.చక్రపాణిపై చర్యలు.. విచారణకు త్రీమెన్ కమిటీ

ABN, First Publish Date - 2023-04-28T13:35:34+05:30

జిల్లా మెడికల్ కాలేజీలో జరిగిన ఎంబీబీఎస్ పరీక్షల్లో ఇన్విజిలేటర్ ప్రశ్నాపత్రాన్ని తన సెల్‌ఫోన్‌తో పోటో తీశారనే ఆరోపణలపై అధికారులు స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు: జిల్లా మెడికల్ కాలేజీలో జరిగిన ఎంబీబీఎస్ పరీక్షల్లో ఇన్విజిలేటర్ ప్రశ్నాపత్రాన్ని తన సెల్‌ఫోన్‌తో పోటో తీశారనే ఆరోపణలపై అధికారులు స్పందించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇన్విజిలేటర్ చక్రపాణి ఎగ్జామ్ హాల్‌లో సెల్ ఫోన్ తీసుకువెళ్లారని వైస్ ప్రిన్సిపాల్ డా.సాయి సుధీర్ తెలిపారు. చీఫ్ అబ్సర్వర్ సెల్ ఫోన్‌ను గుర్తించి ఫిర్యాదు చేశారన్నారు. ఈ క్రమంలో ఇన్విజిలేటర్ డా.చక్రపాణిని విధుల నుంచి తప్పించినట్లు చెప్పారు. సెల్ ఫోన్ వ్యవహారంపై త్రీ మెన్ కమిటీతో విచారణ జరిపిస్తామన్నారు. ఈ వ్యవహారంపై రేపటి(శనివారం)లోగా నివేదిక పంపాలని డీఎంఈ ఆదేశించారన్నారు. త్రి మెన్ కమిటీ విచారణ తర్వాత ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారని వైస్ ప్రిన్సిపాల్ డా.సాయి సుధీర్ వెల్లడించారు.

కర్నూలు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ప్రశ్నాపత్రం ఫోటో తీస్తూ ఇన్విజిలేటర్ డా.చక్రపాణి పట్టుబడిన విషయం తెలిసిందే. అనాటమి పేపర్ 2 ప్రశ్నాపత్రాన్ని ఇన్విజిలెటర్ డా.చక్రపాణి ఫోటో తీస్తుండగా చీఫ్ అబ్సర్వర్ శ్రీనివాస నాయక్ పట్టుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇన్విజిలేటర్ ను విధుల నుంచి తప్పించిన అధికారులు... డీఎంఈ, వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు సమాచారం అందించారు. అయితే అనాటమి పేపర్ 1 కూడా పరీక్షా కేంద్రం నుంచి లీకైందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - 2023-04-28T13:35:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising