ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Kotla Surya Prakash Reddy: ఏపీ ప్రజల్లో మార్పు వచ్చింది...

ABN, First Publish Date - 2023-03-19T12:42:25+05:30

కర్నూలు: ఏపీ (AP) ప్రజల్లో మార్పు వచ్చిందని, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి (Kotla Surya Prakash Reddy) అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

కర్నూలు: ఏపీ (AP) ప్రజల్లో మార్పు వచ్చిందని, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిందని టీడీపీ నేత, మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి (Kotla Surya Prakash Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని (YCP Govt.) ప్రజలు మార్చాలనుకుంటున్నారని అన్నారు. పోలీసులతో టీడీపీ నేతలు (TDP Leaders), కార్యకర్తలను (Activists) భయపెట్టలేరన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు (Welfare Development Programmes) చేపట్టలేదని తీవ్రస్థాయిలో విమర్శించారు.

నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, ప్రభుత్వం ఒక్కటి ఇచ్చిన పాపాన పోలేదని కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సకాలంలో రావడంలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైసీపీ లా టీడీపీ రాక్షస పాలన చేయదన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, వేదవతి గుండ్రేవుల ఆర్డిఎస్ ప్రాజెక్టులను అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా పూర్తి చేస్తామని కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.

Updated Date - 2023-03-19T12:42:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising