ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహానందీశ్వరునికి శ్రీకాళహస్తీశ్వరుని పట్టు వస్త్రాలు

ABN, First Publish Date - 2023-02-12T23:17:07+05:30

మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే కల్యాణానికి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నుంచి పట్టు వసా్త్రలను ఆలయ పాలక మండలి చైర్మన అంజూరు శ్రీనివాసులు, సభ్యులు తీసుకొచ్చారు.

మహానందిలో పట్టు వసా్త్రలు తీసుకొస్తున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయ పాలక మండలి చైర్మన శ్రీనివాసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహానంది, ఫిబ్రవరి 12: మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా జరిగే కల్యాణానికి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నుంచి పట్టు వసా్త్రలను ఆలయ పాలక మండలి చైర్మన అంజూరు శ్రీనివాసులు, సభ్యులు తీసుకొచ్చారు. ఆదివారం మహానందికి చేరుకున్న వీరికి ముఖ మంటపం వద్ద మహానంది ఆలయ ఈవో కాపు చంద్రశేఖర్‌రెడ్డి, పాలక మండలి చైర్మన కొమ్మా మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్ల ఆలయాల్లో అర్చకులకు పట్టు వసా్త్రలను చైర్మన శ్రీనివాసులు దంపతులు అందచేశారు. మహానందీశ్వరునికి, కామేశ్వరీదేవికి అభిషేకార్చన నిర్వహించారు. ఆలయం ప్రాంగణంలోని కల్యాణ మంటపంలో వీరిని వేదపండితులు శాలువాతో సన్మానించగా ఈవో, చైర్మన స్వామివారి మెమెంటో, ప్రసాదాలు అందచేశారు. వీరి వెంట నంద్యాలకు చెందిన దాత లక్కబోయిన ప్రసాద్‌, ఆడిటర్‌ రామసుబ్బయ్య, మహానంది ఆలయ పాలక మండలి సభ్యులు గంగిశెట్టి మల్లికార్జునరావు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2023-02-13T12:19:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising