ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

CM Jagan: తాడేపల్లిలో 8 గంటలు ఈయనతో మంతనాలు.. ఆ 8 గంటలు ఏం జరిగింది..?

ABN, First Publish Date - 2023-04-17T13:58:47+05:30

వివేకా హత్య కేసు నుంచి తన కుటుంబీకులు బయటపడకపోతే మున్ముందు తాను తీవ్ర పరిణామాలు, సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వివేకా హత్య కేసు నుంచి తన కుటుంబీకులు బయటపడకపోతే మున్ముందు తాను తీవ్ర పరిణామాలు, సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని జగన్‌ భయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాజకీయంగాను, న్యాయ వ్యవస్థపైనా ప్రభావం చూపించగలరని ప్రచారం జరుగుతున్న విజయ్‌కుమార్‌ను రంగంలోకి దింపారు. కర్ణాటకకు చెందిన ఈయన.. పేరుకు ఆన్‌లైన్‌లో జ్యోతిష్య సలహాలు ఇస్తుంటారని చెబుతున్నప్పటికీ, తెర వెనుక మాత్రం లాబీమాస్టర్‌గా ప్రసిద్ధుడని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. జ్యోతిషం, పూజల పేరిట రాజకీయ నేతలు, న్యాయ వ్యవస్థలోని పలువురు ప్రముఖుల వద్ద ప్రాపకం సంపాదించిన విజయ్‌కుమార్‌, ఆ పరిచయాలతో తెర వెనుక చక్రం తిప్పుతూ పనులు చక్కబెడుతుంటారన్నది కీలకాంశం.

మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రస్తుత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, సుప్రీంకోర్టులోని అనేక మంది ప్రముఖులకు ఆయన ఇలా పూజా సంబంధ, జ్యోతిష సంబంధ సేవలు అందిస్తున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌, ఇతర న్యాయ ప్రముఖులు ఇటీవల తిరుమల, శ్రీశైలం సందర్శించినప్పుడు కూడా ఆయన వారి వెంట ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతటి కీలక పరిచయాలుండబట్టే న్యాయ వ్యవస్థను వీలైనంత మేర మేనేజ్‌ చేసే బాధ్యతను జగన్‌ ఆయనకు అప్పగించారని చెబుతున్నారు.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ కేసు నుంచి బయటపడేసేందుకు రాజకీయ, న్యాయ ప్రముఖులతో సన్నిహితంగా ఉండే కర్ణాటకకు చెందిన జ్యోతిషుడు విజయ్‌కుమార్‌ను రంగంలోకి దించారు. తనకు అత్యంత సన్నిహితుడైన పారిశ్రామికవేత్త, కృష్ణపట్నం పోర్టు ఎండీగా పనిచేసిన చింతా శశిధర్‌కు ఈ బాధ్యతను అప్పగించారు. దాంతో ఆయన హుటాహుటిన కర్ణాటక వెళ్లి విజయ్‌కుమార్‌ను స్వయంగా వెంట పెట్టుకొని వచ్చారు. మైసూర్‌ నుంచి ప్రత్యేక విమానంలో వారిద్దరూ, మరో సహాయకుడు ఆదివారం విజయవాడలో ల్యాండ్‌ అయ్యారు. నేరుగా తాడేపల్లి ప్యాలెస్‌కు వెళ్లి జగన్‌తో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ఎలాగైనా కేసు నుంచి బయటపడే మార్గం చూడాలని జగన్‌ ఈ సందర్భంగా కోరినట్లు తెలుస్తోంది. దాదాపు 8 గంటల సుదీర్ఘ చర్చల అనంతరం విజయ్‌కుమార్‌, శశిధర్‌ హైదరాబాద్‌కు బయల్దేరి వెళ్లినట్లు సమాచారం. ఆ 8 గంటలు ఏం చర్చించారనే అంశం ప్రస్తుతం వివేకా కేసు పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న వారిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Updated Date - 2023-04-17T13:58:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising