ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP: మాగంటి బాబు కాలుకు తీవ్రగాయాలు

ABN, First Publish Date - 2023-06-23T21:51:12+05:30

ఏలూరు జిల్లాలో టీడీపీ నేతలకు పెను ప్రమాదం తప్పింది. బత్తులవారిగూడెంలో బహిరంగలో మాజీమంత్రి చినరాజప్ప (Former Minister Chinarajappa) ప్రసంగిస్తుండగా సభావేదిక ఒక్కసారిగా కుప్పకూలింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు: ఏలూరు జిల్లాలో టీడీపీ నేతలకు పెను ప్రమాదం తప్పింది. బత్తులవారిగూడెంలో బహిరంగలో మాజీమంత్రి చినరాజప్ప (Former Minister Chinarajappa) ప్రసంగిస్తుండగా సభావేదిక ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో మాజీమంత్రి చినరాజప్పకు, మాజీ ఎంపీ మాగంటి బాబు (Former MP Maganti Babu), పీతల సుజాత సభావేదికపై ఉన్న స్థానిక నాయకులు గాయపడ్డారు. మాగంటి బాబు కాలుకు తీవ్రగాయలయ్యాయి. గాయపడ్డ టీడీపీ కార్యకర్తలను వెంటనే ఆస్పత్రికి తరలించారు. వేదికపై సామర్థ్యానికి మించి నాయకులు, కార్యకర్తలు చేరడం, రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు మెత్తబడిన నేల ఒక్కసారిగా కుంగిపోవడంతో వేదిక కుప్పకూలింది. వర్షం కూడా ప్రారంభం కావడంతో సమావేశం అర్ధాంతరంగా ముగిసింది.

నూజివీడులో టీడీపీ బస్సు యాత్ర

రాష్ట్రం గాడిలో పడాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే మార్గమని ప్రజలు గుర్తించాలని నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. భవిష్యత్‌కు గ్యారెంటీ పేరుతో టీడీపీ చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా జోన్‌-2 పరిధిలోని ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలో శుక్రవారం సాయంత్రం బస్సుయాత్ర జరిగింది. ఈ సంద్బంగా చినరాజప్ప మాట్లాడుతూ టీడీపీ హయాంలోని సంక్షేమ పథకాలకు పేర్లు మార్చి తాను కొత్తగా ఇస్తున్నట్లుగా జగన్‌ ప్రజల కళ్ళకు గంతలు కడుతున్నాడని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో అమలైన పలు సంక్షేమ పథకాలను రద్దుచేసిన విషయాన్ని ప్రజలు గుర్తించాలన్నారు. ఒక్క ఛాన్స్‌ పేరుతో ఒక ఆర్థిక నేరస్థుడు, ఫ్యాక్షనిస్టు చెప్పిన అబద్దాలకు ప్రజలు మోసపోయి ఓట్లు వేయటం వల్ల రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడి శాంతి భద్రతలు క్షీణించాయని, సామాన్య ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోసారి జగన్‌ కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని చినరాజప్ప హెచ్చరించారు.

Updated Date - 2023-06-23T21:51:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising