ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Manchu Manoj: భూమా దంపతులకు మనోజ్‌, మౌనిక నివాళి

ABN, First Publish Date - 2023-03-05T21:25:35+05:30

ప్రేక్షకాభిమానుల ఆశీర్వాదాలే తమకు శ్రీరామరక్ష అని సినీ కథానాయకుడు మంజు మనోజ్‌ (manchu manoj) అన్నారు. భూమా మౌనికా (Bhumika Mounika) తాతగారైన మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆళ్లగడ్డ: ప్రేక్షకాభిమానుల ఆశీర్వాదాలే తమకు శ్రీరామరక్ష అని సినీ కథానాయకుడు మంజు మనోజ్‌ (manchu manoj) అన్నారు. భూమా మౌనికా (Bhumika Mounika) తాతగారైన మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి ఆశీర్వాదం కోసం కొత్త దంపతులు ఆదివారం కర్నూలు నగరంలోని గిప్సన్‌ కాలనీలోగల ఆయన ఇంటికి చేరుకున్నారు. వారికి ఎస్వీ సుబ్బారెడ్డి కుమారుడు, కోడలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, ఆయన సతీమణి ఎస్వీ విజయమనోహరి దంపతులు సాదరంగా ఆహ్వానం పలికారు. అనంతరం ఎస్వీ సుబ్బారెడ్డి (SV Subbareddy)కి నూతన దంపతులు పాదాభివందనం చేశారు. వారి ఆశీర్వాదాలు తీసుకున్న మనోజ్‌, మౌనికలు అక్కడే అల్పాహారం చేశారు. ఈ సందర్భంగా మనోజ్‌కుమార్‌ మాట్లాడుతూ కర్నూలు నుంచి ఆళ్లగడ్డ (Allagadda)కు వెళ్లి అక్కడి నుంచి తిరుమలకు బయలుదేరతామని చెప్పారు. మనోజ్‌కుమార్‌ దంపతుల వెంట బీఆర్‌ఎస్‌ పార్టీ తాండూర్‌ (తెలంగాణ) ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి (MLA Rohit Reddy), కుటుంబ సభ్యులు ఉన్నారు. మంచు మనోజ్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై సందడి చేశారు. ఈ సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకముందు నగర శివారులోని పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద మనోజ్‌ అభిమానులు ఆయనకు పుష్పాలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు.

భూమా దంపతులకు నివాళి

దివంగత నేతలు భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డిలకు ఆళ్లగడ్డ పట్టణంలోని శోభా ఘాట్‌లో ఆదివారం నూతన దంపతులు మంచు మనోజ్‌, మౌనికలు నివాళి అర్పించారు. వీరితోపాటు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలోని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్‌ రామ్‌నాయుడు, భూమా విఖ్యాత్‌రెడ్డి ఘాట్‌లో పుష్పమాలలతో నివాళులర్పించారు. అంతకముందు మంచు మనోజ్‌ పట్టణానికి చేరుకోగానే అభిమానులు బాణసంచా పేల్చి ఘన స్వాతగం పలికారు.

Updated Date - 2023-03-05T21:25:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising