Cyclone Michaung: మిచాంగ్ ఎఫెక్ట్.. తీర ప్రాంత గ్రామాల్లో హైఅలర్ట్
ABN, First Publish Date - 2023-12-04T16:07:52+05:30
Andhrapradesh: తుఫాను నేపథ్యంలో కృష్ణా జిల్లా కోడూరు, నాగాయలంక మండలాల్లోని తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.
కృష్ణా: తుఫాను నేపథ్యంలో కృష్ణా జిల్లా కోడూరు, నాగాయలంక మండలాల్లోని తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. తీర గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు. కోడూరు మండలం పాలకాయతిప్ప, ఇరాలి ప్రాంతాల నుంచి మత్స్యకారులను తుఫాను షెల్టర్లకు అధికారులు తరలిస్తున్నారు. టీడీపీ నేత మండలి బుద్ధప్రసాద్ (TDP Leader Mandali Buddaprasad)తీర గ్రామాల్లో పర్యటించి ప్రజలకు ధైర్యం చెబుతున్నారు. రాశులు పోసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తోలాలని బుద్ధ ప్రసాద్ డిమాండ్ చేశారు. చేతికి వచ్చిన పంట నోటికి రాకుండా పోతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు నాగాయలంక కోడూరు మండలాల్లో పోలీసులు రక్షణ చర్యలు చేపట్టారు. నాగాయలంక మండలం దిగువ ప్రాంతాల ప్రజలను పునరావస కేంద్రాలకు తరలించేందుకు 200 మంది పోలీస్ సిబ్బందితో జిల్లా ఎస్పీ జాషువా నాగాయలంకకు చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో నాగాయలంక నుంచి దిగువ ప్రాంతాలకు పోలీస్ సిబ్బంది బయలుదేరనున్నారు.
Updated Date - 2023-12-04T16:09:27+05:30 IST