ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Adimulapu Suresh : టిడ్కో లే అవుట్లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమన్న మంత్రి ఆదిమూలపు సురేష్

ABN, First Publish Date - 2023-05-10T13:46:09+05:30

గుడివాడ మల్లాయిపాలెం లేఅవుట్‌లో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటించారు. కలెక్టర్ రాజబాబు, అధికార యంత్రాంగంతో కలిసి, టిడ్కో ఫ్లాట్లను సురేష్ పరిశీలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ : గుడివాడ మల్లాయిపాలెం లేఅవుట్‌లో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటించారు. కలెక్టర్ రాజబాబు, అధికార యంత్రాంగంతో కలిసి, టిడ్కో ఫ్లాట్లను సురేష్ పరిశీలించారు. లేఅవుట్లో అభివృద్ధి పనులపై, అధికారులతో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో టిడ్కో లే అవుట్లలో జరిగిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమని, ప్రతిపక్షాలకు మంత్రి సురేష్ సవాల్ విసిరారు. టిడ్కో నిర్మాణాలపై టీడీపీ నేతలు పదేపదే అసత్యాలు ప్రచారం చేస్తున్నారన్నారు. నామమాత్రంగా నిర్మించిన ఫ్లాట్లను టీడీపీ హయాంలో ప్రారంభించారన్నారు. టీడీపీ నేతలు ప్రారంభించిన ఇళ్ళలో ఒకరైన నివాసం ఉంటున్నారా? అని మంత్రి ప్రశ్నించారు. 14 వేల కోట్ల అదనపు ఖర్చుతో లే అవుట్ల అభివృద్ధి చేశారన్నారు. ప్రజలు నేరుగా వచ్చి నివాసముండేలా 50 వేల టిడ్కో ఫ్లాట్లను 100 శాతం నిర్మించామన్నారు. వైసీపీ హయాంలో టిడ్కో లబ్ధిదారులకు 400 కోట్ల రాయితీలు ఇవ్వాలన్నారు. జగన్ ఇస్తున్న ఇళ్లకు.. పదే పదే టీడీపీ నేతలు చెబుతున్న ప్లాట్లకు ఎటువంటి పోలిక లేదన్నారు. పేదవారి సొంతింటి కలను నిజం చేయడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని.. గుడివాడ టిడ్కో ప్లాట్లను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి త్వరలో ప్రారంభిస్తారని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.

Updated Date - 2023-05-10T13:46:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising