AP News: 13 డిమాండ్లల్లో 3 సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం.. చర్చలు విఫలం
ABN, Publish Date - Dec 28 , 2023 | 05:45 PM
మున్సిపల్ కార్మిక సంఘాలతో మంత్రి అదిమూలపు సురేష్ చర్చలు విఫలమయ్యాయి. మున్సిపాల్టీలలో సమ్మెలో పాల్గొన్న సీఐటీయూ నేతలతో మంత్రి చర్చలు ముగిశాయి. రెండున్నర గంటల పాటు మంత్రి, యూనియన్ నేతల మధ్య చర్చలు కొనసాగాయి. ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సమ్మె విరమించాలని యూనియన్ నేతలను మంత్రి సురేష్ కోరారు.
అమరావతి: మున్సిపల్ కార్మిక సంఘాలతో మంత్రి అదిమూలపు సురేష్ చర్చలు విఫలమయ్యాయి. మున్సిపాల్టీలలో సమ్మెలో పాల్గొన్న సీఐటీయూ నేతలతో మంత్రి చర్చలు ముగిశాయి. రెండున్నర గంటల పాటు మంత్రి, యూనియన్ నేతల మధ్య చర్చలు కొనసాగాయి. ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సమ్మె విరమించాలని యూనియన్ నేతలను మంత్రి సురేష్ కోరారు. అయితే చర్చల సారాంశాన్ని కార్మికులకు చెప్పి సమ్మెను కొనసాగించాలా? లేక విరమించాలా? అనే విషయాన్ని తెలియజేస్తామని సీఐటీయూ నేతలు చెప్పారు.
కార్మికుల నుంచి స్పష్టత తీసుకునే వరకు సమ్మెను కొనసాగిస్తామని సీఐటీయూ నేతలు స్పష్టం చేశారు. కాగా 13 డిమాండ్లల్లో 3 సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. జీతం పెంపు, సర్వీసుల క్రమబద్దీకరణపై ప్రభుత్వం ఎలాంటి హామీ ఇవ్వలేదు. కాగా సమ్మెలో లేని సంఘాలతో మంత్రి ఆదిమూలపు సురేష్ చర్చలు జరుపుగుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 11వ పీఆర్సీ ప్రకారం బేసిక్ జీతం రూ.20 వేలుగా ఉందని సీఐటీయూ నేత ఒకరు అన్నారు. పీఆర్సీ ప్రకారం బేసిక్ రూ.20 వేలు ఇవ్వాలని కోరామని, అందుకు ఒప్పుకోకపోతే కార్మికుల సమ్మె కొనసాగుతుందని సీఐటీయూ నేత ఉమామహేశ్వరరావు హెచ్చరించారు.
Updated Date - Dec 28 , 2023 | 05:45 PM