ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Minister Amarnath : మూడు రాజధానులపై సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-02-01T11:44:51+05:30

మూడు రాజధానులపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మాట్లాడుతూ.. విశాఖ నుంచే రాష్ట్ర భవిష్యత్తును మారుస్తామన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విశాఖ : మూడు రాజధానులపై మంత్రి గుడివాడ అమర్‌నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు ఆయన మాట్లాడుతూ.. విశాఖ నుంచే రాష్ట్ర భవిష్యత్తును మారుస్తామన్నారు. విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని కాబోతోందన్నారు. సీఎం స్వయంగా ఇక్కడ నుంచి పాలించ బోతున్నారన్నారు. మూడు రాజధానులపై బిల్లును రీఫిల్ చేశామని.. కొత్త బిల్లుతో వస్తామని గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్ ఎక్కడకి వస్తే అదే రాజధాని అని పేర్కొన్నారు. రాజధానికి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేస్తుందన్నారు. ఏ ఒక్క ప్రాంతాన్ని విస్మరించబోమన్నారు.

రాజధానులు నిర్మించుకునే అధికారం రాష్ట్రానికే ఉందని కేంద్రం చెప్పిందని గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. కాపుల్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి తాకట్టు పెట్టడానికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉన్నారని విమర్శించారు. విశాఖలో ముడసరలోవ, పూర్ణ మార్కెట్ అభివృద్ధి తదితర అభివృద్ధి పనులు చేస్తామంటే అడ్డంకులు తెస్తున్నారని అమర్‌నాథ్ విమర్శించారు. ముఖ్యమంత్రి విశాఖకు వస్తారని.. ఇక్కడ నివాసం ఉంటారని మంత్రి పేర్కొన్నారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు జరుగుతాయన్నారు. రాజధానికి అవసరాన్ని బట్టి ఐటి, పర్యాటక, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, ఇతర శాఖల భవనాలను అవసరాన్ని తగ్గట్టుగా వాడుకుంటామన్నారు. ఏది కుదరకపోతే ప్రైవేట్ భవనాలు తీసుకుంటామని గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు.

Updated Date - 2023-02-01T11:44:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising