ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ambati Rambabu: నువ్వు ఒక చెప్పు చూపిస్తే.. మేము నాలుగు చూపిస్తాం.. పవన్‌పై అంబటి ఫైర్

ABN, First Publish Date - 2023-06-16T13:50:00+05:30

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కు హిరోగా మంచి ఇమేజ్ ఉందన్నారు. సినిమాల్లో హీరోగా ఉండి రాజకీయాల్లో హీరో అవుతారని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజమండ్రి: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై (AP CM YS Jaganmohan Reddy) వారాహి యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) విమర్శలు చేస్తున్నారని జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు (Minister Ambati Rambabu) మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌కు హిరోగా మంచి ఇమేజ్ ఉందన్నారు. సినిమాల్లో హీరోగా ఉండి రాజకీయాల్లో హీరో అవుతారని నిరూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు. హీరోగా ఉండి రాజకీయాల్లో కామెడీ నటుడు అవుతారని నిరూపించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ యెద్దేవా చేశారు. వైసీపీని ప్రశ్నించటానికి మాత్రమే పుట్టిన పార్టీ జనసేన అని అన్నారు. పవన్ కళ్యాణ్ ధ్యేయం ముఖ్యమంత్రి కావటమా? లేక.. అసెంబ్లీలోకి అడుగుపెట్టడమా ? అని ప్రశ్నించారు. 175 స్థానాల్లో పోటీ చేస్తారా అనేది పవన్ కళ్యాణ్ స్పష్టం చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.

స్థిరత్వం లేని పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారన్నారు. పవన్‌ను చంద్రబాబు నడుపుతున్నారని ఆరోపించారు. రాజకీయాల్లో హీరోను కాను అని చిరంజీవి రాజకీయాల నుంచి తప్పుకున్నారని.. పవన్ కళ్యాణ్ ఒక చెప్పు చూపిస్తే తాము నాలుగు చెప్పులు చూపిస్తామని హెచ్చరించారు. బీజేప, టీడీపీ, జనసేనలు పొత్తుతో పోటీ చేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే ప్రవాహాన్ని నియంత్రించే కట్ట గైడ్ బండ్ కుంగిందని.. గైడ్ బండ్ కుంగిన విషయాన్ని దాయాల్సిన అవసరం లేదన్నారు. సాంకేతిక కారణాలపై అధ్యాయనం చేస్తున్నామన్నారు. 41.15 కాంటూరు లెవెల్‌కు భూమి సేకరణ, పునరావాసం కల్పిస్తామన్నారు. రెండో దశలో 45.72 కాంటూరు లెవల్ పూర్తి చేస్తామని అంబటి రాంబాబు పేర్కొన్నారు.

Updated Date - 2023-06-16T13:50:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising