AP News: ఇప్పటికిప్పుడు కోర్కెలు తీర్చలేం: మంత్రి బొత్స వ్యాఖ్యలు
ABN, Publish Date - Dec 29 , 2023 | 04:44 PM
జీతాల పెంపు, గ్రాట్యూటీ డిమాండ్లతో ఆంధప్రదేశ్‌లో అంగన్‌వాడీ సమ్మె కొనసాగుతున్న వేళ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెలా రెండు నెలల్లో ఎన్నికలకు వెళుతున్న దశలో ఇప్పటికిప్పుడు కోర్కెలు తీర్చలేమని అన్నారు. తెలంగాణా ప్రభుత్వం అంగన్‌వాడీలకు జీతాలు పెంచిన ప్రతిసారీ తాము జీతాలు పెంచుతామని చెప్పలేదని వ్యాఖ్యానించారు.
విజయనగరం: జీతాల పెంపు, గ్రాట్యూటీ డిమాండ్లతో ఆంధప్రదేశ్‌లో అంగన్‌వాడీ సమ్మె కొనసాగుతున్న వేళ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నెలా రెండు నెలల్లో ఎన్నికలకు వెళుతున్న దశలో ఇప్పటికిప్పుడు కోర్కెలు తీర్చలేమని అన్నారు. తెలంగాణా ప్రభుత్వం అంగన్‌వాడీలకు జీతాలు పెంచిన ప్రతిసారీ తాము జీతాలు పెంచుతామని చెప్పలేదని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన దోపిడీకి అప్పులు చేస్తే వైసీపీ ప్రభుత్వం సంక్షేమం కోసం అప్పులు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రాలో జీడీపీ పెరగటం తమ ప్రగతి సూచిక అని అన్నారు. పోటీకి అర్హతలేని వారికి టిక్కెట్లు నిరాకరించటం జరుగుతోందన్నారు.
Updated Date - Dec 29 , 2023 | 04:44 PM