Nagababu: కాకాణి గోవర్దన్ మాఫియా రెచ్చిపోతోంది.. మంత్రిపై నాగబాబు ఆగ్రహం
ABN, Publish Date - Dec 17 , 2023 | 02:58 PM
నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్దన్(Kakani Govardhan) గ్రానైట్ అక్రమ తవ్వకాలు చేస్తూ రెచ్చిపోతున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు(Konidela Nagababu) విమర్శించారు.
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాణి గోవర్దన్(Kakani Govardhan) గ్రానైట్ అక్రమ తవ్వకాలు చేస్తూ రెచ్చిపోతున్నారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు(Konidela Nagababu) విమర్శించారు. ఇవాళ నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కాకాణి అక్రమాలకు అధికారులు, పోలీస్ శాఖ వంతపాడుతున్నారని ఆరోపించారు.
తన సొంత రాష్ట్రమైన ఏపీలో ఓటు వేసేందుకు తెలంగాణ(Telangana)లో ఓటును తాను తన కుటుంబం రద్దు చేసుకుందని తెలిపారు. మంగళగిరిలో ఏపీలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే ఓటు హక్కురాకుండా బూత్ లెవల్ స్థాయిలో కూడా వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని తెలిపారు.
రాష్ట్రంలో అధికార పార్టీ నేతల కనుసన్నల్లో అనేక అక్రమాలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ - జనసేన పొత్తు రానున్న ఎన్నికల్లో తమను అధికారానికి చేరువ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
"నాకు పదవులపై ఇంట్రెస్ట్ లేదు. ఎంపీగా పోటీ చేస్తున్నా అనేది రూమర్ మాత్రమే. కాకాణి అక్రమాలకు వ్యతిరేకంగా చేపట్టిన సోమిరెడ్డి దీక్షకు సమయాభావం వల్ల వెళ్లలేకపోయాను. జనసేన, టీడీపీల మధ్య పలు అంశాల్లో విబేధాలు ఉండొచ్చు. వాటిని మేం మాట్లాడుకుని పరిష్కరించుకుంటాం. నెల్లూరులో జనసేన నుంచి మా అభ్యర్థి పోటీ చేస్తారు. వైనాట్ 175 అని వైసీపీ వాళ్లు అంటున్నారు.. వై నాట్ వైసీపీ జీరో అని మేం అంటున్నాం. నియంతృత్వ పోకడలతో వెళ్తున్న సీఎం జగన్ కు ప్రజలు ఈ ఎన్నికల్లో తప్పకుండా బుద్ధి చెబుతారు. నిజమైన నాయకుడు ప్రతిపక్షం ఉండకూడదు అనే ఆలోచన చేయడం మంచిదికాదు. త్వరలో జరిగే ఎన్నికల్లో మేం గెలవబోతున్నాం. వైసీపీ 20 - 25 సీట్లతో ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నాం" అని అన్నారు.
Updated Date - Dec 17 , 2023 | 03:21 PM