Nara Lokesh : జ్వరంతో బాధపడుతున్న నారా లోకేష్.. అయినా పాదయాత్ర చేస్తానని వెల్లడి
ABN, First Publish Date - 2023-05-30T13:50:02+05:30
మహానాడు వేదికపై వర్షానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తడిచిపోయారు. దీంతో ఆయన గత రెండు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు.
అమరావతి : మహానాడు వేదికపై వర్షానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తడిచిపోయారు. దీంతో ఆయన గత రెండు రోజులుగా జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. వైద్యులు ఆయనకు రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ.. 30వ తారీఖున యువగళం పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించానని.. ఎంత ఇబ్బంది ఉన్నా పాదయాత్ర చేస్తానన్నారు. తనకంటే ఎక్కువ బాధల్లో ప్రజలు ఉన్నారన్నారు. వారికి భరోసా ఇవ్వడం ముఖ్యం అని నాయకులతో నారా లోకేష్ అన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు జమ్మలమడుగులో పాదయాత్ర ప్రారంభం కానుంది. ఈ రోజు సాయంత్రం జమ్మలమడుగు బహిరంగ సభలో నారా లోకేష్ మాట్లాడనున్నారు.
Updated Date - 2023-05-30T13:50:02+05:30 IST