ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yuvagalam Padayatra: తెలుగు గంగ ప్రాజెక్ట్‌ను సందర్శించిన నారా లోకేశ్‌

ABN, First Publish Date - 2023-05-14T21:22:23+05:30

తెలుగు గంగ ప్రాజెక్ట్‌ను టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు గంగ (Telugu Ganga) ద్వారా రాయలసీమలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నంద్యాల: తెలుగు గంగ ప్రాజెక్ట్‌ను టీడీపీ నేత నారా లోకేశ్‌ (Nara Lokesh) సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు గంగ (Telugu Ganga) ద్వారా రాయలసీమలో 1.75 లక్షల ఎకరాలకు సాగునీరు, చెన్నైకు తాగు నీరు అందుతోందని తెలిపారు. మాజీ సీఎం ఎన్టీఆర్, టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ముందుచూపు, రాయలసీమపై వారికున్న ప్రేమకు ఈ ప్రాజెక్ట్ నిదర్శనమని తెలిపారు. లేని సమస్యలు సృష్టించి కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టడం.. జగన్ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని దుయ్యబట్టారు. టీడీపీ రాగానే బుడగ/బేడ జంగాల సమస్యలను పరిష్కరిస్తాంమని, శాశ్వత కులధృవీకరణ పత్రాలు జారీ చేస్తామని నారా లోకేశ్‌ ప్రకటించారు. పొరుగు వారికి తోడ్పడవోయ్‌ అనే సిద్ధాంతం టీడీపీదైతే, ఆస్తుల కోసం సొంత తల్లిని, చెల్లిని పొరుగు రాష్ట్రానికి తరిమేసిన ఘనత జగన్‌ది అని లోకేశ్‌ విమర్శించారు.

అంతకుముందు వెలుగోడు ప్రాజెక్టు కార్యాలయం సమీపంలో భవన నిర్మాణ కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. జగన్‌ పాలనలో మొదటి బాధితులు భవన నిర్మాణ కార్మికులేనని, ఎన్నికల ముందు టీడీపీ నాయకులు ఇసుక దందా చేస్తున్నారని ప్రచారం చేసిన జగన్‌ తాను అధికారంలోకి వచ్చాక ట్రాక్టర్‌ ఇసుకను దాదాపు రూ.7వేలకు అమ్ముతున్నారన్నారు. ఇసుక, సిమెంట్‌, స్టీల్‌ ధరలు విపరీతంగా పెరిగాయని, దీని వల్ల భవన నిర్మాణ కార్మికులకు పనులు దొరకడం లేదన్నారు. కరోనా సమయంలో భవన నిర్మాణ కార్మికులను ఆదుకుంటామని చెప్పిన జగన్‌ ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదని లోకేశ్ దుయ్యబట్టారు.

Updated Date - 2023-05-14T21:22:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising