Yuvagalam padayatra: కావలి ఎమ్మెల్యే అవినీతిపై సిట్ : నారా లోకేష్
ABN, First Publish Date - 2023-07-10T22:09:47+05:30
కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అవినీతిపై సిట్ వేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా కావలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ మేరకు ఆయన మాట్లాడారు. కావలి అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని అన్నారు. యువగళం ప్రభంజనం చూసి జగన్‌కు భయం పట్టుకుందని అన్నారు. జగన్ పాలనలో గంటకో కిడ్నాప్, పూటకో రేప్, రోజుకో హత్య జరుగుతోందని విమర్శలు గుప్పించారు.
కావలి: కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి అవినీతిపై సిట్ వేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. యువగళం పాదయాత్రలో భాగంగా కావలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ మేరకు ఆయన మాట్లాడారు. కావలి అభివృద్ధి టీడీపీ హయాంలోనే జరిగిందని అన్నారు. యువగళం ప్రభంజనం చూసి జగన్‌కు భయం పట్టుకుందని అన్నారు. జగన్ పాలనలో గంటకో కిడ్నాప్, పూటకో రేప్, రోజుకో హత్య జరుగుతోందని విమర్శలు గుప్పించారు.
విశాఖను నేరాల రాజధానిగా మార్చేశారని ఎద్దేవా చేశారు. కావలి అభివృద్ధికి ఇచ్చిన నిధుల్లో రూపాయి కూడా ఖర్చుపెట్లలేదని విమర్శించారు. ఇక్కడ 7 శిలాఫలకాలు వేశారు కానీ ఒక్క పని కూడా ప్రారంభం కాలేదని మండిపడ్డారు.
Updated Date - 2023-07-10T22:09:47+05:30 IST