Amaravathi: ఫోన్ ట్యాపింగ్ వ్యవహరాన్ని సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం..
ABN, First Publish Date - 2023-02-02T12:35:15+05:30
అమరావతి: ఏపీ (AP)లో దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహరాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అయితే ట్యాపింగ్ కాదని, రికార్డింగ్ అని మంత్రులు అంటున్నారు.
అమరావతి: ఏపీ (AP)లో దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహరాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అయితే ట్యాపింగ్ కాదని, రికార్డింగ్ అని మంత్రులు అంటున్నారు. దీనిపై నిగ్గు తేల్చేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు (Intelligence Officers) రంగంలోకి దిగారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) విడుదల చేసిన ఆడియోపై వివరాలు సేకరిస్తున్నారు. కోటంరెడ్డితో మాట్లాడిన రామ శివారెడ్డిని విచారించే అవకాశముంది. రామ శివారెడ్డి ఫోన్ డేటాను ఇంటెలిజెన్స్ అధికారులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో గురువారం సీఎం జగన్ సమావేశం నిర్వహించారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి చేసిన ట్యాపింగ్ ఆరోపణలు ప్రభుత్వాన్ని కుదిపేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్ (CM Jagan) ఇవాళ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy)తో పాటు హోంశాఖ కార్యదర్శిని పిలిపించి మాట్లాడారు. ట్యాపింగ్ పై ఎలా స్పందించాలన్న దానిపై కీలక ఆదేశాలు ఇచ్చారు. అలాగే నెల్లూరు రూరల్ స్దానంలో వైసీపీ ఇన్ ఛార్జ్ నియామకంపై చర్చిస్తున్నారు.
ఇది కూడా చదవండి..
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వేధింపులు, కక్ష సాధింపులు
ఆంధ్రప్రదేశ్‌లో మునిగిపోతున్న నావను కాపాడ్డానికి అధికార వైసీపీ (YCP) ఆపసోపాలు పడుతోంది. ఎమ్మెల్యేలు, మాజీలు, సీనియర్లు తిరుగుబాటు ప్రకటించడం.. కొందరైతే ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం.. అన్నింటికి మించి గతంలో ప్రభుత్వాలను కూల్చేసిన చరిత్ర ఉన్న ఫోన్ ట్యాపింగ్ అంశాని ఇవాళ ఏపీ (AP)లో అధికారపార్టీ ఎమ్మెల్యేలు లేవనెత్తడం కలకలంరేపుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాప్ అయినట్లుగా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అయితే అవన్ని నిరాధారాలని.. వెళ్లిపోవడానికి కారణాలు వెతుక్కుంటున్నారని మరో సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivas Reddy) అన్నారు. ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సవాల్ చేశారు. ఈ సవాల్‌ను స్వీకరించిన కోటంరెడ్డి బుధవారం మీడియా సమావేశంలో ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు బయటపెట్టిన విషయం తెలిసిందే.
Updated Date - 2023-02-02T12:35:18+05:30 IST