ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

MLA Kotam Reddy: జగన్‌ ప్రభుత్వానికి నేనే రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తున్నా..

ABN, First Publish Date - 2023-02-05T12:12:57+05:30

నెల్లూరు: జగన్‌రెడ్డి ప్రభుత్వం తీరుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: జగన్‌రెడ్డి ప్రభుత్వం (Jagan Govt.) తీరుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotam Reddy Sridhar Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనను మానసికంగా ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తనకు భద్రత తగ్గించి.. భయపెట్టాలని చూస్తున్నారని అన్నారు. గన్‌మెన్లను తొలగించినంత మాత్రాన భయపడే ప్రసక్తే లేదన్నారు. జగన్‌ ప్రభుత్వానికి తానే రిటర్న్‌ గిఫ్ట్‌ (Return Gift) ఇస్తున్నానని అన్నారు. తనకు గన్‌మెన్‌లు అవసరం లేదని, ఇద్దరు గన్‌మెన్లను తిరిగి ప్రభుత్వానికి అప్పగిస్తున్నానని, ఒంటరిగానే పోరాడుతానని, తనకు కార్యకర్తలే రక్షని కోటంరెడ్డి అన్నారు.

మొదటి నుంచి ఉన్న నలుగురు భద్రత సిబ్బందిని ఇద్దరికి తగ్గించారని, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పనిదే సిబ్బందిని తగ్గించారని ఎమ్మెల్యే కోటంరెడ్డి పేర్కొన్నారు. తనకు బెదిరింపు కాల్స్ (Threat Calls) వస్తున్న నేపథ్యంలో భద్రత పెంచాల్సి ఉందన్నారు. మానసికంగా క్షోభ పెట్టేందుకే భద్రత సిబ్బందిని తగ్గించారని, అందుకే ఇప్పుడున్న ఇద్దరు గన్ మెన్లని తిరిగి ప్రభుత్వానికే అప్పగిస్తున్నానని అన్నారు. తనకు గన్‌మెన్లు అవసరం లేదని, ఒంటరిగా తిరుగుతా.. అందర్నీ కలుస్తా... ఏమైనా చేసుకోవచ్చునని అన్నారు. రెట్టించిన ఉత్సాహాంతో ముందుకు సాగుతానని, ప్రజల పక్షాన ఎందాకైనా వెళతానని, ఎంత దూరమైనా వెళుతానని.. తగ్గేదేలేదని స్పష్టం చేశారు. 175 కి 175 గెలుస్తామంటున్నారు కదా... ఒక్క ఎమ్మెల్యేని ఒంటరిని చేసి 15 మంది మంత్రులు, సలహాదారులు మాట్లాడటం అవసరమా? అని ప్రశ్నించారు. కేసులు పెట్టడం, బెదిరింపు కాల్స్ అవసరమా? అని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జగన్ ప్రభుత్వాన్ని నిలదీశారు.

Updated Date - 2023-02-05T12:13:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising