Aditya L-1 సక్సెస్ కోసం ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు
ABN, First Publish Date - 2023-09-01T09:42:23+05:30
సూళ్లూరుపేటలోని శ్రీచెంగాలమ్మ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఉమ్మడి నెల్లూరు: సూళ్లూరుపేటలోని శ్రీచెంగాలమ్మ ఆలయంలో ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ (ISRO Chairman Somanath) శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిత్యా ఎల్-1 (Aditya L-1) ప్రయోగం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. రేపు (శనివారం) ఉదయం 11.50 గంటలకు పీఎస్‌పీ సి-57 రాకెట్ ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ డాక్టర్ సోమనాథ్ మాట్లాడుతూ.. చంద్రయాన్ - 3 ద్వారా చంద్రుడి మీదకి చేరిన ల్యాండర్, రోవర్ విజయవంతంగా పనిచేస్తున్నాయన్నారుు. అక్టోబర్ మొదటి లేదా రెండవ వారంలో గగన్ యాన్ రాకెట్ ప్రయోగం ఉంటుందని తెలిపారు. జీఎస్ఎల్వీ మార్క్ - 2 ద్వారా ఇన్‌శాట్ 3 డీఎస్ శాటిలైట్‌ను నింగిలోకి పంపుతామన్నారు. నవంబరులో ఎస్ఎస్ఎల్వీ రాకెట్ ప్రయోగం చేపడుతామని ఇస్రో చైర్మన్ సోమనాథ్ వెల్లడించారు.
Updated Date - 2023-09-01T09:43:40+05:30 IST