ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Nellore: ఆ కాలేజీ ఎమ్మెల్యేది కావడంతో చర్యలకు పోలీసులు తర్జనభర్జన

ABN, First Publish Date - 2023-02-20T12:47:24+05:30

నెల్లూరు: కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్ధి ప్రదీప్ కుమార్ (Pradeep Kumar) మృతదేహానికి పోస్టుమార్టం (Postmortem) పూర్తి అయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంజనీరింగ్ విద్యార్ధి ప్రదీప్ కుమార్ (Pradeep Kumar) మృతదేహానికి పోస్టుమార్టం (Postmortem) పూర్తి అయింది. ఆసుపత్రి ఆవరణలో కుటుంబ సభ్యులు, బంధువుల రోధనలు మిన్నంటాయి. జీఆర్పీఎఫ్ పోలీసులు (GRPF Police) తూతూమంత్రంగా కేసు విచారణ జరిపారు. పట్టాల వద్ద పడి ఉన్న మృతుని సెల్ ఫోన్‌ను ప్రదీప్ విద్యార్ధి బంధువులు వెదికితెచ్చారు. తోటి విద్యార్ధులతో పాటు బయట వ్యక్తులు వేధించినట్టు సమాచారం. అయితే కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (Ramireddy Pratap Kumar Reddy)కి చెందిన కాలేజీ కావడంతో చర్యలకు జీఆర్పీఎఫ్, సివిల్ పోలీసులు తర్జనభర్జన పడుతున్నారు. కాగా తోటి విద్యార్థులే ర్యాగింగ్ (Raging) వేధింపులకి పాల్పడ్డారని, తమ కుమారుడిని హత్య (Murder) చేశారని.. తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

పూర్తి వివరాలు..

నెల్లూరు జిల్లా: కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కి చెందిన ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ (RSR Engineering College)లో ర్యాగింగ్ భూతం పడగవిప్పింది. బీటెక్ సెకండియర్ చదువుతున్న ప్రదీప్‌కుమార్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ప్రదీప్‌ను తోటి విద్యార్థులు గత కొంతకాలంగా తీవ్రంగా వేధిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. వారే రైలు కిందకు తోసేసి చంపేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ కాలేజీలో ర్యాగింగ్ జరుగుతున్నట్లు చాలా ఫిర్యాదులు వస్తున్నా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. కాలేజీ ఎమ్మెల్యేకు చెందినది కావడంతో అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ప్రదీప్ మృతి కలకలంరేపుతోంది.

కావలి రైల్వే స్టేషన్ దగ్గర రైలు పట్టాలపై ప్రదీప్ కుమార్ మృత దేహం పడిఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావలి ఏరియా ప్రభుత్వ ఆస్పత్రిలో రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారిని ఎమ్మెల్యే రామిరెడ్డి పరామర్శించారు. ఇక అదే ఆస్పత్రిలో ప్రదీప్ కుమార్ తల్లిదండ్రులు, బంధువులు ఉన్నా.. కనీసం పలుకరించలేదు.

ఈ సందర్బంగా ప్రదీప్ కుమార్ తల్లి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ కుమారుడి మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఎస్ఐకు ఫిర్యాదు చేస్తే... స్పందించలేదని, అక్కడ జరిగింది వాళ్లు ఏం చెబితే అదే రాసుకుంటామని సమాధానమిచ్చారని అన్నారు. తమ కుమారుడు అన్ని విషయాలు తమకు చెప్పాడని, తనను కాలేజీలో తోటి విద్యార్థులు చిత్రహింసలు పెడుతున్నారని, ర్యాగింగ్ చేస్తున్నారని, అమ్మాయిల ఫోన్ నెంబర్లు తెమ్మంటున్నారని, బయటకు చెబితే చంపేస్తామని బెదిరిస్తున్నారని.. ఇలా అన్ని విషయాలు చెప్పాడని ఆమె అన్నారు. తమ కుమారుడిని తోటి విద్యర్థులే చంపేశారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చెందిన ఆర్ఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో ర్యాగింగ్ జరుగుతున్నట్లు చాలా ఫిర్యాదులు వస్తున్నా.. అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. కాలేజీ ఎమ్మెల్యేకు చెందినది కావడంతో అధికారులు పట్టించుకోలేదు. ఈ క్రమంలోనే ప్రదీప్ కుమార్ మృతి కలకలంరేపుతోంది. గత కొంతకాలంగా తోటి విద్యార్థులు ప్రదీప్‌ను ర్యాగింగ్ చేస్తూ.. తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారు. బిర్యానీ, బీర్లు తీసుకురావాలని ప్రతిరోజు వేధిస్తున్నారని ప్రదీప్ తల్లిదండ్రులు చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలను మూడు నెలలుగా ప్రదీప్ తమకు చెబున్నాడని.. దీంతో హాస్టల్ వద్దని వ్యాన్‌లో రోజు వెళ్లిరావాలని చెప్పామన్నారు. ప్రతి రోజు ప్రయాణం ఇబ్బందికరంగా ఉంటుందని హాస్టల్‌లోనే ఉన్నాడని, ఈనెల 23న ఇంటికి వస్తానని చెప్పాడని, ఇంతలోనే ఈ ఘోరం జరిగిందని చెబుతూ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2023-02-20T12:47:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising