ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Gaganyaan : గగన్‌యాన్‌ టీవీ-డీ1 పరీక్ష విజయవంతం.. కేవలం 90 సెకన్లలోనే..

ABN, First Publish Date - 2023-10-21T10:06:35+05:30

గగన్‌యాన్ మిషన్‌లో (Gaganyaan) కీలకమైన తొలిదశ ప్రయోగం టీవీ-డీ1 (టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌-1) చివరి క్షణాల్లో ఆకస్మాత్తుగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. సాంకేతిక లోపంతో టెస్ట్ వెహికల్ ఆగిపోయినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించగా..

గగన్‌యాన్ మిషన్‌లో (Gaganyaan) కీలకమైన తొలిదశ ప్రయోగం టీవీ-డీ1 (టెస్ట్‌ వెహికిల్‌ అబార్ట్‌ మిషన్‌-1) చివరి క్షణాల్లో ఆకస్మాత్తుగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. సాంకేతిక లోపంతో టెస్ట్ వెహికల్ ఆగిపోయినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించగా.. గంట వ్యవధిలోనే ప్రయోగం ఎప్పుడనే విషయాన్ని ట్విట్టర్ వేదికగా అధికారికంగా ఇస్రో ప్రకటించింది. సాంకేతిక లోపం ఎక్కడనే విషయాన్ని గుర్తించి శాస్త్రవేత్తలు సరిచేశారు. ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రయోగిస్తామని ట్వీట్‌లో ఇస్రో తెలిపింది. సరిగ్గా 10 గంటలకు రాకెట్ ప్రయోగించగా నింగిలోకి దూసుకెళ్లింది. సరిగ్గా 10 గంటలకు రాకెట్ ప్రయోగించగా నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. మరో నాలుగైదు గంటల తరువాత క్రూమాడ్యూల్ భూమికి చేరుకోనున్నది.


ఎప్పుడెప్పుడా..?

కాగా.. ప్రయోగానికి సర్వం సిద్ధమై.. ఇక ప్రయోగించడమే తరువాయి అన్నప్పుడు చివరి నిమిషంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో వెంటనే ప్రయోగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు హోల్డ్‌ చేశారు. కేవలం ఐదు సెకన్లలో నింగిలోకి దూసుకెళ్లాల్సి ఉండగా కొద్దిపాటి మంటలు వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన శాస్త్రవేత్తలు ఉన్నతాధికారుల ఆదేశాలతో ప్రయోగాన్ని నిలిపివేశారు. ప్రయోగాన్ని చూడటానికి పెద్ద ఎత్తున జనాలు, విద్యార్థులు ఇస్రోకు వెళ్లారు. మరోవైపు.. లక్షలాది ప్రజలు, ఔత్సాహికులు టీవీలకు, యూట్యూబ్‌లకు అతుక్కుపోయారు.

ప్రయోగం పూర్తయ్యాక..!

మానవ సహిత గగన్‌యాన్‌ ప్రయోగ సన్నాహాల్లో భాగంగా మానవ రహితంగా ఇస్రో చేపడుతున్న కీలక ప్రయోగమిదనే విషయం తెలిసిందే. టీవీ-డీ1 రాకెట్‌ భూమి నుంచి నిర్దేశిత ఎత్తుకు చేరిన తర్వాత క్రూ మాడ్యూల్‌ విడిపోనుంది. క్రూమాడ్యూల్ బరువు 4520 కిలోలు.. భూమి నుంచి 17 కి.మీ ఎత్తులో రాకెట్ నుంచి విడిపోనున్నది. ఐదారు గంటలకి తిరిగి భూమిని చేరేలా డిజైన్ చేయడం జరిగింది. షార్ కేంద్రానికి 10కి.మీ దూరంలో అమర్చిన పారాచూట్ల సాయంతో నెమ్మదిగా దాన్ని బంగాళాఖాతం సముద్రంలోకి దింపుతారు. ఇండియన్ నావీ సహకారంతో క్రూమాడ్యుల్‌ను ఇస్రో సేకరించనున్నది. గగన్‌యాన్‌ ప్రయోగంలో అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపినప్పుడు వారిని తిరిగి భూమిపైకి తీసుకొచ్చేందుకు ఈ క్రూఎస్కేప్‌ వ్యవస్థను ఉపయోగించనుంది.

సక్సెస్..

  • విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన గగన్యాన్ టెస్ట్ మిషన్ టీవీడీ-01 ప్రయోగం

  • 17 కిలోమీటర్ల ఎత్తులో మేడ్యూల్ ను విడిచిపెట్టిన రాకెట్

  • 90 సెకన్లలో నిర్నీత లక్ష్యానికి చేరుకొన్న మేడ్యూల్

  • తిరిగి 8 నిమిషాల్లో బంగాళాఖతంలో ప్యారాచుట్ల ద్వారా విజయవంతంగా భూమిని చేరుకున్న మాడ్యూల్.

  • షార్ కేంద్రానికి 10 కీ.మీ దూరంలో బంగాళ్లఖాతంలో దిగిన మాడ్యూల్

  • మాడ్యూల్‌‌ను సముద్రంలో నుంచి భూమికి చేర్చనున్న ఇండియన్ న్యావి

  • మాడ్యూల్‌ను సురక్షితంగా బయటికి తీసుకువచ్చే పనిలో నావీ బృందాలు‌

  • ఇస్రో వర్గాల్లో వెల్లువెత్తిన ఆనందం..

  • 2025లో మానవసహిత ప్రయోగాలు చేపడుతామని ధీమా

రికవరీ..

  • భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన గగన్ యాన్ మిషన్ TV-D1 ప్రయోగం విజయవంతం

  • నిర్దేశిత దూరం 17 కిలో మీటర్ల మేర ఆకాశంలోకి వెళ్లి భూ వాతావరణంలోకి చేరిన క్రూ మాడ్యూల్..

  • ప్యారా చూట్ల సహకారంతో దశల వారీగా బంగాళాఖాతంలోకి జలాల్లోకి..

  • నావికా దళ సహకారంతో క్రూ మాడ్యూల్ ను రికవరీ చేసిన శాస్త్రవేత్తలు

  • సవాల్‌గా తీసుకొని గంటల వ్యవధిలోనే మెరుపువేగంతో సాంకేతిక లోపాన్ని సరిదిద్దిన శాస్త్రవేత్తలు

ఫుల్ హ్యాపీ..

  • ఈ ప్రయోగం విజయవంతమైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది : ఇస్రో చైర్మన్ సోమనాథ్

  • క్రూ ఎస్కేప్ మోడల్ ను నమూనాగా ప్రయోగించాలని నిర్ణయించాం

  • అనుకున్న విధంగానే ప్రయోగం జరిగింది

  • బంగాళాఖాతంలోకి దిగిన క్రూ మాడ్యూల్ ను రికవరీ చేశాం దానిని అధ్యయనం చేస్తాం

  • మొదట్లో వాతావరణం ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి

  • దాంతో ప్రయోగ సమయాన్ని వాయిదా వేశాం

  • రాకెట్ ప్రయోగం మొదలయ్యే ముందు సాంకేతిక సమస్యను గుర్తించాం

  • దానిని సత్వరమే గుర్తించి సరి చేశాం.. రాకెట్ స్థితిని పరిశీలించి మళ్లీ ప్రయోగించాం

  • ఏదైనా సమస్య ఎదురైతే ఎలా సరిదిద్దాలనే విషయాన్ని మా బృందం చేసి చూపించింది : సోమనాథ్

Updated Date - 2023-10-21T10:53:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising