ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TTD: నెట్టింట్లో వైరల్‌గా మారిన ‘ఓం నమో వేంకటేశాయా’

ABN, First Publish Date - 2023-03-15T21:48:38+05:30

ఏడుకొండల్లో కొలువైన తిరుమల (Tirumala) క్షేత్రానికి చేరుకుంటే మనసు హత్తుకునేలా వినిపించేది ‘ఓం నమో వేంకటేశాయా’ అనే జపం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

తిరుమల: ఏడుకొండల్లో కొలువైన తిరుమల (Tirumala) క్షేత్రానికి చేరుకుంటే మనసు హత్తుకునేలా వినిపించేది ‘ఓం నమో వేంకటేశాయా’ అనే జపం. క్యూలైన్‌లోకి ప్రవేశించిన భక్తులను ఆధ్యాత్మిక చింతన వైపు నడిపించేలా ఈ జపం వినిపిస్తూ ఉంటుంది. నిజానికి ఈ జపాన్ని దాదాపు 30 ఏళ్ల క్రితం పారుపల్లి రంగనాథ్‌ (Parupalli Ranganath) రూపొందించారు. అప్పటి నుంచి నేటి వరకు ఈజపం తిరుమలగిరులతో పాటు క్యూలైన్లలో వినిపిస్తూనే ఉంది. అయితే ప్రస్తుతం ఆ జపం సోషల్‌ మీడియా (Social media)లో వైరల్‌గా మారింది. ఓ టీవీ కార్యక్రమంలో యువ గాయని వైష్ణవి తన తల్లి మాధవిని పరిచయం చేసింది. ఈ క్రమంలో మాధవి మాట్లాడుతూ తాను కూడా సింగర్‌ అని, తిరుమలలో ప్రసారమవుతున్న ‘ఓం నమో వేంకటేశాయా’ అనే జపాన్ని చిన్న వయస్సులో పాడినట్టు వెల్లడించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులు నిత్యం వినే ఆ జపాన్ని మాధవి పాడినట్టు తెలుసుకుని చాలామంది ఆశ్చర్యంగా వీడియో (Video)ను చూస్తూ షేర్లు కొడుతున్నారు.

Updated Date - 2023-03-15T21:48:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising