ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pawan Kalyan: ‘వారాహి’ వస్తోంది..!

ABN, First Publish Date - 2023-06-04T17:57:55+05:30

జూన్ 14 నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు చేస్తారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అన్నవరం: జూన్ 14 నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ (Pawan Kalyan) వారాహి యాత్ర ప్రారంభించనున్నారు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో పవన్ ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం పత్తిపాడు నుంచి పర్యటన ప్రారంభించనున్నారు. పవన్‌ వారాహి యాత్ర నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై గోదావరి జిల్లాల నేతలకు ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) దిశానిర్దేశం చేశారు. యాత్రలో అన్నివర్గాల ప్రజలను పవన్‌ కలిసేలా ప్రణాళిక రచించారు. ఒక్కో నియోజకవర్గంలో రెండు రోజుల పాటు పవన్‌ వారాహి యాత్ర కొనసాగనుంది. ప్రతి రోజు ఉదయం బస చేసిన ప్రాంతంలో స్థానిక సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. వీటి పరిష్కారానికి అక్కడి నుంచే ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తారు. అందులో తీవ్రమైన సమస్య ఉన్న చోటకు వెళ్లి పర్యటించనున్నట్టు జిల్లా పార్టీ వర్గాలు వివరించాయి. అంతేకాకుండా ప్రజాసమస్య లను తెలుకుని, వాటిపై పోరాడడమే లక్ష్యంగా కొనసాగనుంది. మరోపక్క నియోజకవ ర్గాల్లో యువత, మహిళలు, రైతుల కష్టాలను తెలుసుకోవడంతోపాటు కళాకారులు, మత్స్యకారులు, భవన నిర్మాణ కార్మికులు ఇలా అన్ని వర్గాలతో మమేకం కానున్నారు. తొలుత ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి ప్రారంభం అయ్యే వారాహి యాత్ర ఆ తర్వాత పిఠాపురం, కాకినాడ రూరల్‌, కాకినాడ, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు మీదుగా సాగనుంది. ఇప్పటికే యాత్ర రూట్‌మ్యాప్‌పై చర్చించేందుకు తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల నాయకులతో మనోహర్‌ సమావేశమైన విషయం తెలిసిందే.

Updated Date - 2023-06-04T17:58:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising