Peddireddy Ramachandrareddy : పాత అబద్ధపు హామీలతో కొత్త వాటిని కలిపితే టీడీపీ మేనిఫెస్టో..
ABN, First Publish Date - 2023-05-29T12:28:23+05:30
తాడిపత్రిలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించనున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిర్వహించిన ప్రజా సంక్షేమ పాదయాత్ర ముగింపు సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని పెద్దిరెడ్డి తెలిపారు.
అనంతపురం : తాడిపత్రిలో రాష్ట్ర విద్యుత్, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించనున్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నిర్వహించిన ప్రజా సంక్షేమ పాదయాత్ర ముగింపు సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో మంత్రి ఉషశ్రీ చరణ్, ఎమ్మేల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలు ఇచ్చారని పెద్దిరెడ్డి తెలిపారు. టీడీపీ మేనిఫెస్టోలో 100 పేజీలు పెట్టారన్నారు. ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదన్నారు.
వైసీపీ సంక్షేమ పథకాలను ప్రవేశ పెడితే రాష్ట్రం శ్రీలంకగా మారుతుందని చంద్రబాబు విమర్శించారన్నారు. ఈ రోజు పాత అబద్ధపు హామీలతో కొత్త అబద్ధపు హామీలు కలిపి టీడీపీ మేనిఫెస్టో విడుదల చేశారన్నారు. వైసీపీ కేవలం రెండు పేజీల మేనిఫెస్టో తో వచ్చి 98.44 శాతం హామీలు నెరవేర్చారన్నారు. ఈ రోజు నుంచి టీడీపీ కార్యకర్తలు మానిఫెస్టో తో ప్రజల్ని మభ్యపెట్టే పనిలో పడతారన్నారు. రాష్ట్రంలో ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా సీఎం వైఎస్ జగన్ గతంలో కంటే అధిక సీట్లు సాధించి అధికారంలోకి వస్తారని పెద్దిరెడ్డి పేర్కొన్నారు.
Updated Date - 2023-05-29T12:28:23+05:30 IST