ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Polavaram: పోలవరం ఇక ‘మినీ’ రిజర్వాయరే!

ABN, First Publish Date - 2023-03-24T05:14:27+05:30

పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలో 92 టీఎంసీలే నీరు నిల్వ చేయబోతున్నారన్న సాగునీటి రంగ నిపుణులు, రైతుల ఆందోళనే నిజమవుతుందా..? 45.72 మీటర్ల కాంటూరులో 194.60 టీఎంసీల నీటిని గరిష్ఠ స్థాయిలో నిల్వ చేయకుండా.. 92 టీఎంసీలకు సరిపుచ్చి.. ప్రాజెక్టును మినీ రిజర్వాయరుకే పరిమితం చేస్తారని కేంద్రం మాటలను బట్టి స్పష్టమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

41.15 మీటర్ల కాంటూరుకే సరి!!

ప్రస్తుతానికి ఆ ఎత్తుకే ప్రాజెక్టు

94 టీఎంసీల వరకే నీటి నిల్వ

నిర్మాణం మరింత ఆలస్యం

లోక్‌సభలో కేంద్రం వెల్లడి

రెండో దశ ఊసెత్తని వైనం

సీఎం జగన్‌దీ అదే తీరు

(అమరావతి/న్యూఢిల్లీ-ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టులో 41.15 మీటర్ల కాంటూరు పరిధిలో 92 టీఎంసీలే నీరు నిల్వ చేయబోతున్నారన్న సాగునీటి రంగ నిపుణులు, రైతుల ఆందోళనే నిజమవుతుందా..? 45.72 మీటర్ల కాంటూరులో 194.60 టీఎంసీల నీటిని గరిష్ఠ స్థాయిలో నిల్వ చేయకుండా.. 92 టీఎంసీలకు సరిపుచ్చి.. ప్రాజెక్టును మినీ రిజర్వాయరుకే పరిమితం చేస్తారని కేంద్రం మాటలను బట్టి స్పష్టమవుతోంది. ప్రాజెక్టు ఎత్తు ప్రస్తుతానికి 41.14 మీటర్లకే పరిమితమని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ గురువారం స్పష్టం చేశారు. అంత మేరకే నీటిని నిల్వ చేయనున్నట్లు లోక్‌సభలో వైసీపీ ఎంపీ సత్యవతి అడిగిన ప్రశ్నకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో పేర్కొన్నారు.

తొలి దశ సహాయ పునరావాసం కూడా ప్రాజెక్టు ఎత్తు మేరకే ఉంటుందని చెప్పారు. 1.06 లక్షల మంది నిర్వాసిత కుటుంబాల్లో తొలి దశలో 20,946 మందే ప్రభావితులవుతారని, అయితే 2023 ఫిబ్రవరి నాటికి కేవలం 11,677 కుటుంబాలకే పునరావాసం అమలు చేశారని తెలిపారు. 2004 ఏప్రిల్‌ 8న విడుదలైన ప్రాథమిక నోటిఫికేషన్‌ నాటికి 18 ఏళ్ల వయసులోపు ఉన్నవారు పునరావాసానికి అర్హులు కారని, అయితే త మకూ పునరావాసం కల్పించాలని వారు అభ్యర్థిస్తున్నారని వెల్లడించారు.

పునరావాసం కోసం 1,27,263 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉండగా.. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 1,13,119 ఎకరాలను సేకరించారని.. మిగతా భూమి సేకరణ వివిధ దశల్లో ఉందని.. డిసెంబరు నాటికి పూర్తిగా సేకరించాల్సి ఉందని చెప్పారు. ముందుగా అనుకున్నట్లు ప్రాజెక్టు 2023 మార్చిలోపు పూర్తయ్యే అవకాశం లేదని, అది మరింత ఆలస్యమవుతుందని తెలిపారు. రెండో దశ, 45.72 మీటర్ల కాంటూరు గురించి ప్రస్తావించలేదు. మొదటి దశ గురించి మాత్రమే చెప్పడాన్ని నిపుణులు తప్పుబడుతున్నారు.

92 టీఎంసీల నిల్వకే పరిమితమైతే ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టుగా కాకుండా.. మినీ రిజర్వాయరుగా మిగిలిపోతుంది. ఇప్పుడు 41.15 మీటర్ల కాంటూరులో మరో 9,299 నిర్వాసిత కుటుంబాలకు సహాయ పునరావాసం అందించాంటే.. ఇంకో రూ.2,800 కోట్లు కావాలని.. అవి కేంద్రమే ఇవ్వాలని.. అప్పుడు ప్రాజెక్టు పనులు ముందుకు నడుస్తాయని కేంద్రానికి జల వనరుల శాఖ తెలియజేసింది. కానీ కేంద్రం సుముఖంగా లేదు.

ఇంకోవైపు.. 2020, 21 వరదలకు దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌ మరమ్మతుకు రూ.1,900 కోట్ల దాకా వ్యయమవుతుంది. ఈ డబ్బులు మాత్రం ఇస్తామని కేంద్రం తెలిపింది. ఈ డయాఫ్రం వాల్‌ మరమ్మతు పనులు చేస్తూనే.. తొలి దశను చకచకా పూర్తిచేసి.. ఈ ఏడాది డిసెంబరులో ప్రాజెక్టును ప్రారంభించేసి.. పోలవరాన్ని తానే పూర్తిచేశానని ప్రచారం చేసుకోవడానికి సీఎం జగన్మోహన్‌రెడ్డి సిద్ధపడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తు తున్నాయి.

ముంపుపై ఏప్రిల్‌ 3న సమావేశం

హైదరాబాద్‌: పోలవరం బ్యాక్‌వాటర్‌ వల్ల కలిగే ముంపుతో ముడిపడిన సాంకేతిక అంశాలపై చర్చించడానికి వీలుగా ఏప్రిల్‌ 3వ తేదీన కేంద్ర జల వనరుల సంఘం(సీడబ్ల్యూసీ) చైర్మన్‌ నేతృత్వంలో కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల ఈఎన్‌సీలకు సీడబ్ల్యూసీ గురువారం ఆహ్వానం పంపింది. మరోవైపు పోలవరం బ్యాక్‌వాటర్‌ ముంపుపై ఒడిశా, ఛత్తీ్‌సగఢ్‌, తెలంగాణ రాష్ట్రాలు దాఖలు చేసిన పిటిషన్లపై ఈనెల 27వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌తో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు కూడా నీట మునుగుతున్నాయని తెలంగాణ గుర్తుచేస్తోంది. 1986లో వచ్చిన వరద కన్నా 2022 ఆగస్టు వరద తక్కువే ఉన్నప్పటికీ ముంపు తీవ్రత అధికంగా ఉందని గుర్తు చేసింది.

Updated Date - 2023-03-24T08:32:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising