ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ongole: మేడికోల గ్యాంగ్ వార్.. 15 మంది విద్యార్థుల సస్పెన్షన్..

ABN, First Publish Date - 2023-11-23T09:15:10+05:30

ఒంగోలు: రిమ్స్ మెడికల్ కాలేజీలో గ్యాంగ్ వార్ ఘటనపై వైద్య విద్యా విభాగం డైరెక్టర్ సీరియస్ అయ్యారు. కాలేజీలో గొడవ పడిన 15 మంది విద్యార్థులను హాస్టల్, కాలేజీ తరగతుల నుంచి బహిష్కరించారు.

ఒంగోలు: రిమ్స్ మెడికల్ కాలేజీలో గ్యాంగ్ వార్ ఘటనపై వైద్య విద్యా విభాగం డైరెక్టర్ సీరియస్ అయ్యారు. కాలేజీలో గొడవ పడిన 15 మంది విద్యార్థులను హాస్టల్, కాలేజీ తరగతుల నుంచి బహిష్కరించారు. మెడికల్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న పలువురు విద్యార్థులు గంజాయి సేవిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పలుమార్లు మిగతా విద్యార్థులతో వారు గొడవ కూడా పడ్డారు. సోమవారం తరగతిగదితో పాటు రిమ్స్ ఎదురుగా మెడికల్ షాపు వద్ద సంఘమిత్ర సమీపంలో టీ స్టాల్‌లో రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడుదలకు దిగడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ విషయం బయటకు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలని డీఎంఈ ఆదేశించారని మెడికల్ కలాశాల ప్రిన్స్‌పల్ ఏడుకొండలు తెలియజేశారు. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో విచారణ కమిటీని నియమించినట్లు తెలిపారు. పోలీసులు ఇరు వర్గాలపై కేసులు కూడా నమోదు చేశారని ప్రిన్స్‌పాల్ తెలిపారు.

కాగా రిమ్స్‌ మెడికల్‌ కాలేజీలో ఘర్షణకు దిగిన మెడికోలపై చర్యలు తీసుకుంటామని డీఎస్పీ కె.నారాయణస్వామిరెడ్డి తెలిపారు. రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు చిన్నచిన్న విషయాల్లో గొడవపడి కొట్టుకున్నారని ఆయన చెప్పారు. మంగళవారం స్థానిక తాలూకా పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో మద్యం తాగి వచ్చి గొడవ పడినందుకు తొమ్మిది మంది విద్యార్థులను హాస్టల్‌ నుంచి సస్పెండ్‌ చేశారన్నారు. ఈక్రమంలో తిరిగి సోమ, మంగళవారాల్లో విద్యార్థులు బాహాబాహీకి దిగడంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారన్నారు. అయితే వివాదానికి కారణమైన వారందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కేసులు నమోదు చేసేందుకు వెనుకాడబోమ న్నారు.పోలీసులకు మంగళవారం ఉదయం ప్రచార మాద్యమం ద్వారా సమాచారం తెలిసిందన్నారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని, వివాదానికి కారణమైన వారిని అరెస్టు చేస్తామన్నారు. రిమ్స్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఏడుకొండలరావు మాట్లాడుతూ మెడికోలు రెండు వర్గాలుగా విడిపోయి తరచూ గొడవలకు దిగుతున్నారని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వివాదాలకు కారణమైన వారిపై సస్పెన్సన్‌ వేటు వేస్తామన్నారు. తాను బాధ్యతలు తీసుకొని ఐదువారాలు అయిందని చెప్పారు. ఇంకా కళాశాల వ్యవహారాలను లోతుగా అధ్యయనం చేయాల్సి ఉందన్నారు.

Updated Date - 2023-11-23T09:15:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising