ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ABN ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. జగన్ ఫ్లెక్సీల తొలగింపు..

ABN, Publish Date - Dec 22 , 2023 | 12:34 PM

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్...: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుసగా ప్రసారం చేసిన కథనాలతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రకాశం జిల్లా, ఒంగోలులో ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఫ్లెక్సీలను వైసీపీ నేతలు రాత్రికి రాత్రి తొలగించారు. జగన్‌ను ఏసుక్రీస్తుతో పోలుస్తూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్...: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుసగా ప్రసారం చేసిన కథనాలతో వైసీపీ నేతలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రకాశం జిల్లా, ఒంగోలులో ఏర్పాటు చేసిన సీఎం జగన్ ఫ్లెక్సీలను వైసీపీ నేతలు రాత్రికి రాత్రి తొలగించారు. జగన్‌ను ఏసుక్రీస్తుతో పోలుస్తూ వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో గుట్టు చప్పుడు కాకుండా జగన్ ఫ్లెక్సీలను వైసీపీ నేతలే దగ్గరుండి మరీ తొలగించారు. గతంలో కూడా పేదలకు, పెత్తందార్లకు మధ్య యుద్ధం అంటూ వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. దీనిపై అప్పట్లో పలువురు విమర్శించారు. వేల కోట్ల ఆస్తులు ఉన్న సీఎం జగన్ పేదవాడా? అంటూ సెటైర్లు వేయడంతో ఆ ఫ్లెక్సీలను అప్పట్లో ఆగమేఘాల మీద తొలగించారు. ఐప్యాక్ డైరెక్షన్‌లో ఫ్లెక్సీలు వేసి వైసీపీ అభాసుపాలు అవుతోంది.

విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా.. జగనన్న కనెక్ట్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించారు. ఓ వర్గం మనోభావాలు దెబ్బతీసే విధంగా ఫ్లెక్సీలు ఉన్నాయంటూ సర్వత్రా విమర్శలు వచ్చాయి. అలాగే చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌కల్యాణ్‌ ఫొటోలు ముద్రించి ఆ పార్టీ వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా హోర్డింగులు ఉన్నాయని ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రసారం చేసింది. దీంతో అధికారులు నిన్న సాయంత్రం హోర్డింగులను తొలగించారు.

Updated Date - Dec 22 , 2023 | 01:27 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising