Heart Attack: విద్యార్థులకు పాఠాలు చెబుతూ కుప్పకూలిన టీచర్..
ABN, First Publish Date - 2023-03-04T14:10:13+05:30
స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెబుతూ ఓ ఉపాధ్యాయుడు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
ఒంగోలు: స్కూల్లో (School) విద్యార్థుల (Students)కు పాఠాలు చెబుతూ ఓ ఉపాధ్యాయుడు (Teacher) ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. గుండెపోటు (Heartstroke) కారణంగా ఆ ఉపాధ్యాయుడు చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఒంగోలు జిల్లా (Ongole District) వాకవారిపాలెంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (Govt Primary School) లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు బాపట్ల జిల్లా పంగళూరుకు చెందిన పాలపర్తి వీరబాబుగా చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో వీరబాబు హెడ్మాస్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈరోజు యధావిధిగా విధులకు హాజరైన అతను పాఠాలు చెబుతూ గుండెపోటు రావడంతో అపస్మారకస్థితోలోకి చేరుకున్నారు. విద్యార్థులు గమనించి ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. వెంటనే వారు 108కు కాల్ చేశారు. వెంటనే వారు అక్కడకు చేరుకుని టీచర్‌కు చికత్స అందించారు. అయితే వీరబాబు అప్పటికే మృతి చెందినట్లు 108 సిబ్బంది నిర్ధారించారు.
కాగా... ఇటీవల కాలంలో గుండెపోటుతో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. పెద్ద, చిన్నా అనే తేడా లేకుండా పలువురు గుండెపోటుకు గురై ప్రాణాలు విడుస్తున్నారు. జిమ్ చేస్తూ, బాడ్మింటన్ ఆడుతూ, పెళ్లి వేడుకల్లో ఒకరు హార్ట్‌స్ట్రోక్‌తో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వారిని ఆస్పత్రులకు తరలించేలోగానే చనిపోయారు.
Updated Date - 2023-03-04T15:59:44+05:30 IST