ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ramakrishna: ముందస్తు ఎన్నికలొస్తే జగన్ ఇంటికి వెళ్లడం ఖాయం

ABN, First Publish Date - 2023-10-10T15:17:00+05:30

ఒంగోలు: ఏపీకి ముందస్తు ఎన్నికలొస్తే సీఎం జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయడానికి వ్యూహాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు.

ఒంగోలు: ఏపీ (AP)కి ముందస్తు ఎన్నికలొస్తే (Early Elections) సీఎం జగన్ (CM Jagan) ఇంటికి వెళ్లడం ఖాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి (CPI State Secretary) రామకృష్ణ (Ramakrishna) వ్యాఖ్యానించారు. ఏపీలో టీడీపీ (TDP), జనసేన (Janasena)తో కలిసి పోటీ చేయడానికి వ్యూహాన్ని రూపొందిస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ (PM Modi) సహకారంతోనే టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)ను జైలుకు పంపారని ఆయన ఆరోపించారు. బాబు అరెస్టు విషయంలో సీఐడీ చెబుతున్న అంశాల్లో డొల్లతనం కనిపిస్తోందన్నారు. ఆధారాలు లేకుండా చంద్రబాబును సీఐడీ (CID) అరెస్టు చేసిందన్నారు. తాడేపల్లి కేంద్రంగా మద్యం వ్యాపారం జరుగుతోందని రామకృష్ణ ఆరోపించారు.

చంద్రబాబు తప్పు చేస్తే అరెస్టు చేయకూడదని తాను చెప్పనని.. కానీ ఇవాళ ప్రభుత్వం చెబుతున్న సమాధానం ఎంత డొల్లతనంగా ఉందో అర్థమవుతోందని రామకృష్ణ అన్నారు. చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాత ఆధారాలు సేకరిస్తామని చెబుతున్నారని, అరెస్టు చేసి నెలరోజులు అవుతోందని, ఇంతవరకు ఆధారాలు చూపలేదని రామకృష్ణ మండిపడ్డారు.

Updated Date - 2023-10-10T15:17:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising