Ashwini Dutt: చంద్రబాబుది ముమ్మాటికీ అక్రమ అరెస్టే.. వాళ్లకు శిక్ష తప్పదు
ABN, First Publish Date - 2023-09-13T14:39:04+05:30
చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజు తెలుగు ప్రజలకు దురదృష్టకరమైన రోజు అని ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ అభిప్రాయపడ్డారు. ఈ దేశానికి గొప్ప ప్రైమ్ మినిస్టర్, గొప్ప లోక్ సభ స్పీకర్‌ను, గొప్ప రాష్ట్రపతిని ఇచ్చిన ది గ్రేట్ లెజెండరీ చంద్రబాబును ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజు తెలుగు ప్రజలకు దురదృష్టకరమైన రోజు అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ దేశానికి గొప్ప ప్రైమ్ మినిస్టర్, గొప్ప లోక్ సభ స్పీకర్‌ను, గొప్ప రాష్ట్రపతిని ఇచ్చిన ది గ్రేట్ లెజెండరీ చంద్రబాబును ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేయడంపై అశ్వనీదత్ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అక్రమ కేసుల్లో టీడీపీ నేతలను అరెస్ట్ చేసి లేనిపోని బీభత్సం చేసిన వారికి కచ్చితంగా పుట్టగతులు ఉండవని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం చేసిన పనికి పరిష్కారం ఎన్నో రోజుల్లో లేదని... మూడు, నాలుగు నెలల్లో ఎన్నికలు రాగానే వాళ్లు శిక్షను అనుభవిస్తారని చెప్పారు. అటు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించబోతుందని అశ్వనీదత్ జోస్యం చెప్పారు. 175 సీట్లకు కచ్చితంగా 160 సీట్లను టీడీపీ గెలిచి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: NCBN Arrest: తెలుగు సినీ ప్రముఖులకు ఏమైంది? ఎందుకు స్పందించడం లేదు?
తాజాగా అశ్వనీదత్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అశ్వనీదత్ బాటలో చిత్ర ప్రముఖులందరూ ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రశ్నించాలని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు. మంగళవారం నాడు నందమూరి బాలయ్య ప్రెస్ మీట్ పెట్టి జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇంకా ఈ అంశంపై స్పందించలేదు. నారా ఫ్యామిలీ తరపున నారా రోహిత్ తన వాయిస్‌ను సోషల్ మీడియా వేదికగా గట్టిగానే వినిపిస్తున్నాడు. చంద్రబాబు అరెస్ట్‌పై ఇప్పటికే ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు, నిర్మాత నట్టికుమార్ స్పందించారు. చంద్రబాబు చిత్ర పరిశ్రమకు శ్రేయోభిలాషి వంటి వ్యక్తి అని, అలాంటి వ్యక్తి అరెస్ట్ అయితే చిత్ర పరిశ్రమ పెద్దలు ఎవరూ స్పందించకపోవడం దారుణమని నట్టికుమార్ వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-09-13T14:39:04+05:30 IST