ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PSLV-C55: పీఎస్‌ఎల్వీ-సీ55 రాకెట్ ప్రయోగం విజయవంతం

ABN, First Publish Date - 2023-04-22T14:44:56+05:30

పీఎస్‌ఎల్వీ-సీ55 (PSLV-C55) రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా (Tirupati District) షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూళ్లూరుపేట: పీఎస్‌ఎల్వీ-సీ55 (PSLV-C55) రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లా (Tirupati District) షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి శనివారం మధ్యాహ్నం 2:20 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ55 రాకెట్‌‌ను ప్రయోగించారు. సింగపూర్‌ (Singapore)కు చెందిన 741 కిలోల టెలియోస్‌-2 శాటిలైట్‌తో పాటు.. 16 కిలోల లూమ్‌లైట్‌-4 ఉపగ్రహాన్ని ఇస్రో (ISRO) రోదసిలోకి పంపారు. షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి రాకెట్ ప్రయోగించారు. శుక్రవారం ఉదయం సూళ్లూరుపేట (Sullurupeta)లోని చెంగాళమ్మ ఆలయంలో రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు చేశారు. ఈ రోజు సరిగ్గా మధ్యాహ్నం 2:20 గంటలకు పీఎస్‌ఎల్వీ-సీ55 రాకెట్‌‌ను రోదసిలోకి పంపారు.

ఏడాదికి 12 రాకెట్‌ ప్రయోగాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో చైర్మన్‌ ఎస్‌ సోమనాథ్‌ తెలిపిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఇస్రోకిది తొలి పీఎస్‌ఎల్వీ ప్రయోగం కాగా.. ఈ సిరీస్‌లో 57వ ప్రయోగమని చెప్పారు. వాణిజ్య రంగ ప్రయోగాల్లో ఇది ఐదోదని పేర్కొన్నారు. ఈ ప్రయోగానంతరం జీఎస్‌ఎల్వీ రాకెట్‌ ద్వారా నావికా ఉపగ్రహ ప్రయోగం ఉంటుందని, ఆ తర్వాత కీలకమైన చంద్రయాన్‌-3, ఆదిత్య-ఎల్‌1 ప్రయోగాలు కూడా ఉంటాయని వెల్లడించారు. ఇకపై ప్రతినెలా ఒక ప్రయోగం ఉంటుందన్నారు. ఇదిలా ఉండగా, పీఎస్‌ఎల్వీ-55 ప్రయోగంతో హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్‌ ధ్రువ స్పేస్‌ తమ పరికరాలను పరీక్షించనుంది. శాటిలైట్‌ ఆర్బిటాల్‌ డిప్లయర్‌ (డీఎస్‌ఓడీ)కు సంబంధించిన రెండు వేరియంట్లు, ఉపగ్రహ ఆధారిత డేటా రిలే కార్యక్రమాలను ఉపయోగపడే రేడియో ప్రీక్వెన్సీ మాడ్యూల్‌ను ఈ స్టార్టపే అందించింది.

Updated Date - 2023-04-22T15:09:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising