ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Reliance Jio: ఏపీలో 3 సిటీల్లో జియో 5జీ సేవలు ప్రారంభం

ABN, First Publish Date - 2023-02-07T20:02:22+05:30

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే 5జీ సేవలను అందుబాటులోకి రిలయన్స్ జియో మరో 8 రాష్ట్రాల్లోని 10 నగరాల్లో ట్రూ 5జీ సర్వీసులను (5G services) విస్తరించింది. ఇందులో భాగంగా మంగళవారం రోజు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ట్రూ 5జీ సర్వీసులను (True 5G services) ప్రారంభించినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 236 నగరాల్లో ట్రూ 5జీ సేవలను అందిస్తున్నట్లు రిలయన్స్ జియో పేర్కొంది. 2023 డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా ట్రూ 5జీ సర్వీసులను అందించడమే లక్ష్యంగా పని చేస్తున్నామని సంస్థ తెలిపింది. ఈ నగరాల్లోని జియో వినియోగదారులు 1జీబీపీఎస్ (Gbps) వేగంతో అపరిమిత డేటాను పొందేందుకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా జియో (Jio) వెల్‌కమ్ ఆఫర్‌కు ఆహ్వానించబడతారని మంగళవారం జియో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని హిందూపూర్, మదనపల్లె, ప్రొద్దుటూరు సిటీల్లో జియో 5జీ సేవలను ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్, ఒడిశాలో తాల్చేర్, పంజాబ్‌లోని పాటియాలా, రాజస్థాన్‌లోని అల్వార్, తెలంగాణలో మంచిర్యాల, ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్, ఉత్తరాఖండ్‌లోని రూర్కీ నగరంలో నేటి నుంచి జియో 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చామని రిలయన్స్ జియో సంస్థ పేర్కొంది. ఈ ప్రాంతాలను డిజిటలైజ్ చేయాలనే తమ తపనకు నిరంతరం మద్దతు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వాలకు తాము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని రిలయన్స్ జియో ప్రతినిధి చెప్పారు.

Updated Date - 2023-02-07T20:04:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising