Ayyanna Patrudu: ఏపీలో రౌడీ రాజ్యం కొనసాగుతోంది: అయ్యన్నపాత్రుడు
ABN, First Publish Date - 2023-02-21T21:04:55+05:30
ఏపీలో రౌడీ రాజ్యం కొనసాగుతోందని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ధ్వజమెత్తారు. గన్నవరంలో టీడీపీ ఆఫీస్పై వైసీపీ నేతలు దాడికి పాల్పడినా..
అనకాపల్లి: ఏపీలో రౌడీ రాజ్యం కొనసాగుతోందని టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ధ్వజమెత్తారు. గన్నవరంలో టీడీపీ ఆఫీస్పై వైసీపీ నేతలు దాడికి పాల్పడినా.. డీజీపీ స్పందించక పోవడం దారుణమన్నారు. డీజీపీ, సీఎం జగన్ (CM Jagan)కు సాయం చేయాలనుకుంటే.. వైసీపీలో చేరి సేవ చేసుకోవాలన్నారు. వైసీపీ నేతల దాడి దృశ్యాలు స్పష్టంగా కనిపిస్తున్నా.. డీజీపీ చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. టీడీపీ (TDP) ఆఫీస్కు వస్తున్న పట్టాభిరామ్ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పట్టాభిరామ్కు ఏం జరిగినా డీజీపీనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఏపీలో విపక్షాలపై వైసీపీ దాడుల పట్ల కేంద్రం దృష్టి సారించాలని అయ్యన్నపాత్రుడు కోరారు.
ఏపీ పోలీసుల పని తీరు దారుణం
ఏపీ పోలీసుల పని తీరు దారుణమని టీడీపీ నేత నిమ్మకాయల చినరాజప్ప (Nimmakayala Chinarajappa) దుయ్యబట్టారు. పోలీసులు పరువు పోగొట్టుకుని చులకన అవుతున్నారని పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడి జరిగితే.. వారిపైనే కేసులు పెట్టారని తప్పుబట్టారు. పట్టాభిరామ్ను పోలీసులు తీసుకెళ్లి ఇబ్బందులకు గురిచేశారని, వైసీపీ దాడులకు పోలీసులే సాక్షులుగా నిలుస్తున్నారని మండిపడ్డారు. అనపర్తి పాదయాత్రను పోలీసులే అడ్డుకుని.. విధులకు ఆటంకం కలిగించారని టీడీపీ నేతలపై కేసులు పెట్టారని విమర్శించారు. టీడీపీకి వస్తున్న ఆదరణను జీర్ణించుకోలేకే వైసీపీ నేతలు దాడులకు దిగుతున్నారని చినరాజప్ప మండిపడ్డారు.
Updated Date - 2023-02-21T21:04:56+05:30 IST