Sharannavaratri: మూడవరోజు అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ
ABN, First Publish Date - 2023-10-17T09:32:19+05:30
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు మూడవరోజుకు చేరుకున్నాయి. ఈరోజు(మంగళవారం) అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. సకల జీవరాశులకు అన్నం సర్వజీవనావధారం అలాంటి అన్నాన్ని ప్రసాదించేదేవత అన్నపూర్ణాదేవి.
విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు మూడవరోజుకు చేరుకున్నాయి. ఈరోజు(మంగళవారం) అన్నపూర్ణాదేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి అమ్మవారిని భక్తులు దర్శించుకుంటున్నారు. సకల జీవరాశులకు అన్నం సర్వజీవనావధారం అలాంటి అన్నాన్ని ప్రసాదించేదేవత అన్నపూర్ణాదేవి. అక్షయ పాత్ర ధరించి దర్శనిమిచ్చే అన్నపూర్ణను సేవిస్తే అన్న పానీయాలకు లోటుండదని భక్తుల విశ్వాసం. అమ్మవారు ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నమును వజ్రాలు పొదిగిన గరిటెతో తన పతి ఈశ్వరునికి భిక్షం వేసిన మహాతల్లి అన్నపూర్ణేశ్వరి. లోకం ఆకలిని తీర్చడం కన్నా మిన్న ఏదీలేదు. అందుకే అన్నిదానాల్లో కంటే అన్నదానం మిన్న అంటారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో ఉన్న అన్నపూర్ణాదేవిని దసరా మహోత్సవాలలో దర్శించుకుంటే అన్నపానీయాలకు కొదవ ఉండదని భక్తుల ప్రతీతి.
Updated Date - 2023-10-17T09:32:19+05:30 IST