ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lokesh Padayatra: కార్యకర్తల భుజాలపై నుంచి మాట్లాడతా: లోకేశ్

ABN, First Publish Date - 2023-02-11T21:41:04+05:30

నా పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, నేను మాట్లాడుతుంటే వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక మైకును లాక్కెళ్లారు. మైకును లాక్కోవచ్చు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిత్తూరు: ‘నా పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణ, నేను మాట్లాడుతుంటే వస్తున్న స్పందన చూసి తట్టుకోలేక మైకును లాక్కెళ్లారు. మైకును లాక్కోవచ్చు. కానీ నా సౌండు బాక్సును నొక్కేయలేరు కదా’ అని తన గొంతు వైపు చూపిస్తూ టీడీపీ నేత నారా లోకేశ్‌ (NaraLokesh) ఆగ్రహించారు. పాదయాత్ర (Padayatra)లో ప్రతి రోజూ ఏదోలా కేసు నమోదు చేస్తున్నారు.. 400 రోజులకు కలిపి 400 కేసులు ఒకేసారి పెట్టేయవచ్చు కదా అని సీఎం జగన్‌ (CM Jagan) ను ప్రశ్నించారు. 16వ రోజు యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra)లో భాగంగా శనివారం ఆయన చిత్తూరు జిల్లాలోని శ్రీరంగరాజపురం మండలంలో పర్యటించారు. పుల్లూరు క్రాస్‌ వద్ద లోకేశ్‌ మాట్లాడుతున్న మైక్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పుల్లూరు క్రాస్‌తో పాటు పిళ్లారికుప్పం, కత్తెరపల్లె ప్రాంతాల్లోనూ తనను చూసేందుకు వచ్చిన ప్రజలను ఉద్దేశించి స్టూల్‌ ఎక్కి ఆయన మైకు లేకుండానే ప్రసంగించారు.

‘రాష్ట్రంలో ఎవరిని కదిలించినా జగన్‌ ప్రభుత్వ బాధితులే ఉన్నారు. ఆయా వర్గాల ప్రజలు నన్ను కలిసి బాధలు చెప్పుకుంటున్నారు. జగన్‌ పిల్లిలా అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్నాడు. దమ్ముంటే పులిలా నాకు మైకు ఇప్పించి మాట్లాడించాలి. నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. నేను పుట్టే సమయానికే మా తాత సీఎంగా ఉన్నారు. రెండున్నరేళ్లుగా మంత్రిగా ఉండి ఏ తప్పు చేయలేదు. అందుకే ధైర్యంగా ప్రజల్లోకి వస్తున్నా. జగన్‌ భయపడి పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు. 2019 ఎన్నికల్లో ఓడిపోయింది టీడీపీ కాదు, రాష్ట్ర ప్రజలు. జగన్‌కు అనుభవం లేదు. అవగాహన లేదు. నేర్చుకోవాలనే తపన కూడా లేదు. రాజధాని విషయంలో టీడీపీకి స్పష్టత ఉంది. పరిపాలన ఒకేచోట ఉండాలి. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. సైకో పోవాలి, సైకిల్‌ రావాలి, అనే పాటలు పెడుతుంటే సౌండ్‌ వెహికల్స్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. ఇక నుంచి అందరి సెల్‌ఫోన్లలో ఈ పాటలు పెట్టుకుని పాదయాత్ర చేద్దాం. ఎంతమంది సెల్‌ఫోన్లను పోలీసులు లాక్కెళతారో చూద్దాం. గతంలో జగన్‌ దెబ్బకు ఐఏఎస్‌ అధికారులు జైలుకు వెళ్లారు. ఈసారి రఘురామిరెడ్డి వంటి ఐపీఎస్‌లు జైలుకు వెళ్తారు. జిల్లా ఎస్పీతో కాకుండా నేరుగా డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలతో మాట్లాడి, లోకేశ్‌ మైకును లాక్కోమని ఆదేశాలిస్తున్నాడు. జ్యుడీషియల్‌ విచారణ చేయించి చట్టాన్ని అతిక్రమించిన ఏ ఒక్కర్నీ వదిలిపెట్టం’ అని లోకేశ్‌ హెచ్చరించారు.

కార్యకర్తల భుజాలపై నుంచి మాట్లాడతా..

‘నేను మాట్లాడుతున్నానని పోలీసులు మైకు లాక్కున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాన్ని, పోలీసుల్ని ప్రజలు చీదరించుకుంటున్నారు. ఇప్పుడు నేను మైకు లేకుండానే మా తాత దివంగత ఎన్టీఆర్‌ ఇచ్చిన గొంతుతో మాట్లాడుతున్నా. దీన్ని ఎవరూ ఆపలేరు. ఒకవేళ రేపు నేను మాట్లాడుతున్న స్టూల్‌ను కూడా తీసుకెళ్లిపోతే, ఆయా ప్రాంతాల్లో ఉన్న గోడ మీదకెక్కి మాట్లాడతా. అక్కడా కాదంటే కార్యకర్తల భుజాల మీదకెక్కి మాట్లాడతా. అంతే తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు’ అని కత్తిరిపల్లెలో లోకేశ్‌ అన్నారు.

200 కిలోమీటర్లకు గుర్తుగా..

శ్రీరంగరాజపురంలో శనివారం ఉదయం ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రం కార్వేటినగరంలో ముగిసింది. మండలంలోని కత్తెరపల్లె గ్రామంలో లోకేశ్‌ 200 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. దీనికి గుర్తుగా జీడీనెల్లూరు నియోజకవర్గంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటుచేస్తానని లోకేశ్‌ హామీనిచ్చారు.

16వ రోజు 17.5 కిలోమీటర్లు

లోకేశ్‌ 16వ రోజు పాదయాత్ర శ్రీరంగరాజపురం మండలంలోని హనుమాన్‌ టెంపుల్‌ శిబిరం నుంచి శనివారం ప్రారంభమై కార్వేటినగరం మండలం కొత్తూరు శిబిరం వద్ద ముగిసింది. శనివారం ఆయన 17.5 కిలోమీటర్లు నడిచారు.

Updated Date - 2023-02-11T21:41:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising