ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహాశివరాత్రికి శ్రీముఖలింగంలో ఏర్పాట్లు

ABN, First Publish Date - 2023-02-12T23:39:08+05:30

దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో పి.ప్రభాకరరావు తెలిపారు. ఉత్సవ ఏర్పా ట్లను విలేకరులకు వివరించారు. ఈనెల 18 నుంచి మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్య లు చేపడుతున్నామన్నారు.

క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్న సిబ్బంది
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జలుమూరు, ఫిబ్రవరి 12: దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగంలో మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో పి.ప్రభాకరరావు తెలిపారు. ఉత్సవ ఏర్పా ట్లను విలేకరులకు వివరించారు. ఈనెల 18 నుంచి మూడు రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్య లు చేపడుతున్నామన్నారు. భక్తులకు ఉచి త, ప్రత్యేక దర్శనాలకు వేర్వేరుగా బారికేడ్లు, వీఐపీలకు వారా హి అమ్మవారి ఆలయం నుంచి ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తు న్నామన్నారు. భక్తులకు ఎండతగలకుండా షామియానాలు వేస్తున్నామని చెప్పారు. అన్ని శాఖల అధికారుల సమన్వయం తో ఉత్సవాలు విజయవంతానికి చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. 18న మహాశివరాత్రి జాగారం, 19న పడియా, 20న స్వామివారి చక్రతీర్థ స్నానాలు వంశధార నదిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అయితే గతంలో వంశధార నదిలో స్వామివారి చక్రతీర్థ స్నానాలు ఒంటి గంటకు నిర్వహించేవారమన్నారు. ఈ ఏడాది మధ్యాహ్నం 1.30 గంటల వరకు వరకు అమావాస్య ఉన్నందున పాడ్యమి గడియలు వచ్చిన వెం టనే స్వామి ఉత్సవ మూర్తులను వంశధార నదికి తీసుకెళ్లి చక్రతీర్థ స్నానాలు 2 గంటల సమయంలో నిర్వహిస్తున్నామని, భక్తులు సహకరించాలని కోరారు.

Updated Date - 2023-02-13T12:12:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising