ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP News: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌పై నన్నూరి సంచలన ఆరోపణలు..

ABN, First Publish Date - 2023-03-24T12:10:48+05:30

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ (Speaker Tammineni Sitaram)పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి (Nannuri Narsireddy) సంచలన ఆరోపణలు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్‌ (Speaker Tammineni Sitaram)పై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి (Nannuri Narsireddy) సంచలన ఆరోపణలు చేశారు. డిగ్రీ మధ్యలోనే ఆపేసిన తమ్మినేని మూడేళ్ల ‘లా’ (Law) కోర్సులో అక్రమంగా చేరారంటూ నన్నూరి ఆరోపించారు. డిగ్రీ మధ్యలోనే ఆపేసినట్లు స్వయంగా ప్రకటించుకున్న తమ్మినేని.. లా కోర్సులో ఏ అర్హతతో చేరారని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న సీతారామ్‌కు ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు ఏమైనా మినహాయింపు ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు.

ఏపీ శాసనసభా స్పీకర్ తమ్మినేని సీతారామ్ 2019లో సభాపతి అయిన తర్వాత ఉన్నత చదువు కోసం ఓయూ పరిధిలోని మహాత్మాగాంధీ లా కాలేజీ (Mahatma Gandhi Law College)లో ఎల్ఎల్‌బీ (LLB) అడ్మిషన్ తీసుకున్నారని నన్నూరి తెలిపారు. మూడేళ్ల ఈ కోర్సు చదవాలంటే డిగ్రీ పాసై ఉండాలి. లేదా డిగ్రీకి సమానమైన కోర్సు పూర్తి చేసిన వారు లా కోర్సు చేయడానికి అర్హులని అన్నారు. డిగ్రీ మధ్యలో ఆపేసిన తమ్మినేని ఎల్ఎల్‌బీ మూడేళ్ల కోర్సులో అడ్మిషన్ ఎలా పొందారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయిందన్నారు. డిగ్రీ సర్టిఫికేట్ ఏ విధంగా సంపాదించారో స్పీకర్ చెప్పాల్సిన అవసరం ఉందని నన్నూరి నర్సిరెడ్డి అన్నారు.

Updated Date - 2023-03-24T12:10:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising