ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

AP News: మీడియా సంస్థలపై బూతు పురాణం.. రిమ్స్ ఆర్‌ఎంవో ఓవరాక్షన్

ABN, First Publish Date - 2023-06-28T10:06:38+05:30

మీడియా పట్ల రిమ్స్ ఆర్‌ఎంవో శంకర్ రావు అత్యుత్సాహం ప్రదర్శించాడు. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో కన్న తండ్రే కొడుకును అతి కిరాతకంగా చంపేశాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: మీడియా పట్ల రిమ్స్ ఆర్‌ఎంవో శంకర్ రావు అత్యుత్సాహం ప్రదర్శించాడు. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో కన్న తండ్రే కొడుకును అతి కిరాతకంగా చంపేశాడు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. విషయం తెలిసిన పోలీసులు మృతదేహాన్ని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ఘటనను చిత్రీకరించేందుకు ఆస్పత్రికి వెళ్లిన మీడియాపై ఆర్‌ఎంవో చిందులు తొక్కాడు. జగన్ ప్రభుత్వాన్ని కుల మీడియా జబ్బు పట్టిస్తోందంటూ విరుచుకుపడ్డారు. ఆస్పత్రి గేటు వద్దే మీడియాను అడ్డగిస్తూ ఇష్టం వచ్చినట్లు దుర్భాషలాడాడు. తొడ కొడుతూ మీడియా ప్రతినిధులను ఆర్‌ఎంవో శంకర్‌ రావు బెదిరింపులకు దిగాడు. మీడియా సంస్థలపై బూతు పురాణం అందుకున్నాడు. గతంలో ఈ ఆర్‌ఎంవోపై లైంగిక ఆరోపణలు ఉన్నాయి. మీడియా పట్ల ఆర్‌ఎంవో అనుచిత ప్రవర్తనపై మీడియా ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కాగా.. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం కుప్పిలి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తున్న కన్న కొడుకును తండ్రి కత్తితో నరికి చంపాడు. మిగతా కుటుంబ సభ్యులను కూడా చంపేందుకు యత్నించగా.. వారంతా కేకలు వేయడంతో తండ్రి కోండ్రు కుప్పేసు పరారయ్యాడు. తీవ్రంగా గాయపడిన పెద్దకొడుకు కోండ్రు తాతారావు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ హత్యకు కుటుంబ కలహాలే కారణంగా తెలుస్తోంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Updated Date - 2023-06-28T12:32:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising