Atchannaidu: ఆ కుటుంబాల ఉసురు మంత్రి పెద్దిరెడ్డికి తగలకమానదు..
ABN, First Publish Date - 2023-01-16T13:27:53+05:30
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు (Chandrababu) పర్యటనను అడ్డుకోవడం అధికార దుర్వినియోగమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) మండిపడ్డారు.
అమరావతి: టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత చంద్రబాబు (Chandrababu) పర్యటనను అడ్డుకోవడం అధికార దుర్వినియోగమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) మండిపడ్డారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ మంత్రి పెద్దిరెడ్డి (Minister Peddireddy) విపరీత పోకడల్ని డీజీపీ (DGP) నివారించాలని డిమాండ్ చేశారు. పండగపూట జైలులో ఉన్నవారి కుటుంబాల ఉసురు పెద్దిరెడ్డికి తగలకమానదని అన్నారు. పోలీసులపై ఒత్తిడి తెచ్చి 30 యాక్టు నోటీసు ఇవ్వడం అధికార దుర్వినియోగమేనని అన్నారు. పలుచోట్ల కోడి పందేలు, జూదాలు జరుగుతున్నా.. పోలీస్ యాక్టు 30 ఏమైందని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి తప్పు చేయకపోతే ప్రతిపక్ష నేతను ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. ప్రజలను భయపెట్టి లాండ్, శాండ్, వైన్, మైన్, రెడ్ శాండిల్ కుంభకోణాలు చేస్తున్నారని, పెద్దిరెడ్డి చేసే అక్రమాలు బయటపడతాయనే భయంతోనే దాడులు చేయిస్తున్నారని, డీజీపీ జోక్యం చేసుకుని ప్రతిపక్ష నేత పర్యటన సజావుగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు.
Updated Date - 2023-01-16T13:27:56+05:30 IST