Srikalahasti: వైభవంగా శ్రీకాళహస్తీశ్వరుడి రథోత్సవం
ABN, First Publish Date - 2023-02-19T19:52:20+05:30
తిరుపతి జిల్లా (Tirupati District) శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో ఆదివారం రథోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది.
శ్రీకాళహస్తి: తిరుపతి జిల్లా (Tirupati District) శ్రీకాళహస్తీశ్వరాలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల్లో ఆదివారం రథోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితులైన శంకరుడు, ఆయన దేవేరి గౌరీదేవి రెండు రథాలపై అధిరోహించారు. చతుర్మాడ వీధుల్లో రథాలను లాగేందుకు భక్తులు (Devotees) పోటీ పడ్డారు. ఈ ఉత్సవాన్ని తిలకించేందుకు పట్టణవాసులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చారు. రాత్రి నారదపుష్కరిణిలో తెప్పోత్సవ కార్యక్రమం నేత్రపర్వంగా జరిగింది. తెప్పలపై ఊరేగుతున్న జ్ఞానప్రసూనాంబ, శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకునేందుకు వందలాదిమంది భక్తులు తరలివచ్చారు.ఆదివారం వేకువ జామున ముక్కంటి ఆలయంలో లింగోధ్బవ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.వేలాదిమంది భక్తులు లింగోద్భవ దర్శనం చేసుకుని తరించిపోయారు.
Updated Date - 2023-02-19T19:52:21+05:30 IST