ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

AP Govt: జగన్‌పై ఏపీ ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2023-03-02T18:30:40+05:30

సీఎం జగన్‌ (CM Jagan)పై ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ (Suryanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉద్యోగుల సంఘాన్ని ఎవరూ రద్దు చేయలేరని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

విజయనగరం: సీఎం జగన్‌ (CM Jagan)పై ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ (Suryanarayana) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉద్యోగుల సంఘాన్ని ఎవరూ రద్దు చేయలేరని, సీఎంకు కూడా ఆ శక్తి లేదని తేల్చిచెప్పారు. సమస్యలపై గవర్నరును కలిస్తే తప్పు చేసినట్లు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల ఖాతాల్లోని డబ్బును ప్రభుత్వం తీసుకోవడం చట్టప్రకారం నేరమన్నారు. జీపీఎఫ్ (GPF) సొమ్ము చెల్లింపులో జాప్యం చేస్తోందని, వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తోందని సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగులకు వేతన వెతలు ప్రారంభమయ్యాయి. జీతం చేతికి ఎప్పుడు అందుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. విడతలవారీగా జమ చేస్తుండడంతో కొందరి ఖాతాల్లో పడే సరికి నెల ముగిసిపోతోంది. కొన్నిశాఖల్లో పనిచేస్తున్న వారికి రెండు నెలలు గడిచి మూడో నెల ముగింపునకు వస్తున్నా ఇంకా వేతనం అందని పరిస్థితి ఏర్పడింది. పనిచేసిన కాలానికి జీతాలివ్వండి మహాప్రభో అని వారు అడుక్కోవాల్సి వస్తోంది. అయినా ప్రభుత్వంనుంచి స్పందన లేకపోవడంతో వారంతా అప్పులపాలవుతున్నారు. వాటిని సకాలంలో చెల్లించలేక మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.

Updated Date - 2023-03-02T18:30:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!