Yuvagalam: నా తల్లికి, భార్యకు వెంకటగిరి చీరలు తీసుకెళ్లా: లోకేశ్
ABN, First Publish Date - 2023-06-21T18:39:46+05:30
‘‘2014లో ప్రచారానికి వచ్చినప్పుడు.. నేను నా తల్లికి, భార్యకు వెంకటగిరి చీరలు తీసుకెళ్లా. వెంకటగిరి హ్యాండ్లూమ్కి ఒక బ్రాండ్ ఉంది. దానికి కావాల్సింది మార్కెటింగ్ మాత్రమే’’ అని నారా లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. డక్కిలిలో చేనేత కార్మికులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు.
తిరుపతి: ‘‘2014లో ప్రచారానికి వచ్చినప్పుడు.. నేను నా తల్లికి, భార్యకు వెంకటగిరి చీరలు తీసుకెళ్లా. వెంకటగిరి హ్యాండ్లూమ్కి ఒక బ్రాండ్ ఉంది. దానికి కావాల్సింది మార్కెటింగ్ మాత్రమే’’ అని నారా లోకేశ్ (Nara Lokesh) ఆవేదన వ్యక్తం చేశారు. డక్కిలిలో చేనేత కార్మికులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్ (CM Jagan) పాలనలో చేనేతలకు అన్ని విధాలుగా నష్టమేనని విమర్శించారు. వెంకటగిరి అంటేనే చేనేత అని.. వెంకటగిరి (Venkatagiri) చేనేతతో తనకు చాలా అనుబంధం ఉందని లోకేశ్ గుర్తుచేశారు. పట్టు రైతులను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం పట్టు రైతుల వ్యవస్థను భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు. జీఎస్టీ రూపంలో కూడా చేనేత సోదరులకు సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. అనుభవం, అవగాహన లేనివాళ్లు పాలకులైతే సమస్యలు వస్తాయని విమర్శించారు. మంగళగిరిలో సమగ్ర చేనేత విధానాన్ని ప్రకటిస్తామని నారా లోకేశ్ తెలిపారు.
పాదయాత్రలో ప్రత్యేక ఆకర్షణగా ఆనం
డక్కిలిలో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్రలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వెంకటగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ వైఫల్యాలను లోకేశ్‌కు ఆనం చూపించారు. లోకేష్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని, ప్రజల భవిష్యత్ కోసమే ఆయన యువగళం పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉందని ఆనం వ్యాఖ్యానించారు.
Updated Date - 2023-06-21T18:43:19+05:30 IST