ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

TarakaRatna: ఒక్కొక్కరుగా హృదయాలయ ఆస్పత్రికి నందమూరి కుటుంబ సభ్యులు.. కాసేపట్లో తారకరత్న హెల్త్ బులెటిన్.. సర్వత్రా ఉత్కంఠ..

ABN, First Publish Date - 2023-02-18T17:12:15+05:30

తారకరత్న (TarakaRatna)కు 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ (Narayana Hrudalayala Hospital) ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: తారకరత్న (TarakaRatna)కు 23 రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ (Narayana Hrudalayala Hospital) ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అప్పటి నుంచి ఈ రోజు వరకు తారకరత్న ఆరోగ్య పరిస్థితి అంత్యంత విషమంగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆరు రోజుల క్రితం విదేశాల నుంచి ముగ్గురు వైద్యులు వచ్చారు. ఈ ముగ్గురు వైద్యుల పర్యవేక్షణలో తారకరత్న బ్రెయిన్‌కి చికిత్స అందిస్తున్నారని చెబుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రతి రెండు రోజులకొకసారి ఎంఆర్‌ఐ స్కాన్ (MRI scan) తీస్తున్నారు. అయితే ఆ రిపోర్టు (Report) వివరాలను కానీ, హెల్త్ బులెటిన్‌ (Health Bulletin)లను విడుదల చేయలేదు. దీనికి ఆసుపత్రి యాజమాన్యం ఎలాంటి కారణం చెబుతుందంటే.. కుటుంబసభ్యుల అనుమతి లేకుండా ఎలాంటి రిపోర్టు విడదల చేయలేమని అంటున్నారు. రెండు వారాలుగా తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి రిపోర్టులూ వెల్లడికాలేదు. తారకరత్న ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆయన భార్య అలేఖ్యారెడ్డి (Alekhya Reddy), కుమార్తె అక్కడే ఉన్నారు.

ఆసుపత్రిలో చేరిన ఓ వారం తర్వాత తారకరత్న ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందని చెబుతూ వచ్చారు. ప్రస్తుతానికి ఆయన పరిస్థితి మరింత విషమంగానే ఉందని చెబుతున్నారు. ప్రధానంగా బ్రెయిన్‌కు సంబంధించిన చికిత్స అందిస్తూ ఉన్నారు. ఆయన బ్రెయిన్ వాపు ఇంకా తగ్గలేదని చెబుతున్నారు. విదేశాల నుంచి వచ్చిన వైద్యులు, ఆసుపత్రి బోర్డు మీటింగ్‌లో తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఎక్కడైనా విదేశీ వైద్యులు వచ్చి చికిత్స అందిస్తున్నారంటే ఆ వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించాల్సి ఉంది. అయితే బెటర్ మెంట్ ఉందనే విషయాన్ని కూడా వెల్లడించకపోవడం గమనార్హం. ఇప్పటికీ తారకరత్న ఆరోగ్యంపై ఎటువంటి అప్‌డేట్ ఇవ్వడం లేదు.

ఆసుపత్రి రూల్ ప్రకారం ప్రతి రెండు రోజులు.. లేదా ప్రతి 12 గంటలకు.. అంత్యంత విషయంగా ఉంటే 24 గంటల్లో ఎలాంటి పరీక్షలు చేసినా వాటికి సంబంధించిన రిపోర్టులు రిలీజ్ చేయాలి. కానీ రెండు వారాలు అవుతున్నా హెల్త్ బులెటిన్ విడుదల చేయలేదు. దీంతో నందమూరి, నారా అభిమానులు, టీడీపీ (TDP) కార్యకర్తల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. మరోవైపు ఇప్పుడిప్పుడే నందమూరి కుటుంబ సభ్యులంతా ఒక్కొక్కరుగా హృదయాలయ ఆస్పత్రికి చేరుకుంటూ ఉండటంతో అభిమానుల్లో మరింత ఆందోళన పెరిగింది. అయితే డాక్టర్లు రిలీజ్ చేయనున్న తారకరత్న రిపోర్టులో ఏం ప్రకటన చేయబోతున్నారు..? అనేదానిపై అటు కుటుంబ సభ్యులు.. ఇటు అభిమానుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

కొద్దిసేపటి క్రితం ఆసుపత్రికి చేరుకున్న బాలకృష్ణ

కొద్దిసేపటి క్రితం నారాయణ హృదయాల ఆసుపత్రికి బాలకృష్ణ (Balakrishna) చేరుకున్నారు. ప్రతి వారం బాలకృష్ణ ఆసుపత్రి వస్తూ మెడికల్ బిల్లులు చెల్లిస్తూ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తున్నారు. వాస్తవానికి ప్రతి సోమవారం బాలకృష్ణ ఆసుపత్రికి వస్తున్నారు. కానీ ఈ సారి రెండు రోజుల ముందే అంటే ఈ రోజు (శనివారం) ఆయన ఆసుపత్రికి వచ్చారు. బాలకృష్ణ ఉన్నఫలంగా రావడంతో.. ఏం జరుగుతోందోనని ఎన్టీఆర్ అభిమానులు ఆందోళనలో పడుతున్నారు. ఆసుపత్రికి వచ్చిన బాలకృష్ణ ఏం మాట్లాడతారు.. ఎలాంటి వివారాలు చెబుతారోనని ఉత్కంఠ నెలకొంది.

Updated Date - 2023-02-18T17:17:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising