ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TDP chief Chandrababu : ఏమిటీ దుర్మార్గం?

ABN, First Publish Date - 2023-08-10T03:26:28+05:30

‘వైసీపీ మూకలు నాపైనే రాళ్లు రువ్వి హత్యాప్రయత్నం చేసి.. తిరిగి నాపైనే హత్యాయత్నం నేరాన్ని అంటగడతారా? ఎన్‌ఎ్‌సజీ రక్షణలో ఉన్న నాపై కేసు నమోదు చేయడం దుర్మార్గం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి కేసులకు

చంపడానికి ప్రయత్నించింది వాళ్లు..

తిరిగి నాపైనే హత్యాయత్నం కేసా..? చంద్రబాబు ఫైర్‌
ఎన్‌ఎస్‌జీ, మీడియా, ప్రజల సాక్షిగా

వైసీపీ వాళ్లు రాళ్ల దాడి చేశారు

కమెండోలు బుల్లెట్‌ ప్రూఫ్‌లను

అడ్డుపెట్టి నన్ను కాపాడారు: చంద్రబాబు

అంగళ్లు ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలి

ప్రధాని, రాష్ట్రపతి, గవర్నరుకు ఫిర్యాదు చేస్తా

తప్పుడు కేసులకు భయపడేది లేదు

ఇంత అరాచక పాలన ఎక్కడా లేదు

డీఐజీ, ఎస్పీపై చర్య తీసుకోవాలి

టీడీపీ అధినేత డిమాండ్‌

ఎన్‌ఎ్‌సజీ, ప్రజలు, మీడియా సాక్షిగా నాపై వైసీపీ నేతలు దాడి చేశారు. ఎన్‌ఎ్‌సజీ కమేండోలు తమ వద్ద ఉన్న బులెట్‌ ఫ్రూఫ్‌లను అడ్డం పెట్టి రాళ్ల దాడి నుంచి నన్ను కాపాడారు.

సైకో ముఖ్యమంత్రి ఆదేశాలతోనే నాపై దాడికి పూనుకున్నారు. మంత్రి పెద్దిరెడ్డి, ఆయన తమ్ముడు ఇది చేయించారు.

- చంద్రబాబు

విజయనగరం, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ మూకలు నాపైనే రాళ్లు రువ్వి హత్యాప్రయత్నం చేసి.. తిరిగి నాపైనే హత్యాయత్నం నేరాన్ని అంటగడతారా? ఎన్‌ఎ్‌సజీ రక్షణలో ఉన్న నాపై కేసు నమోదు చేయడం దుర్మార్గం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ఇలాంటి కేసులకు భయపడేది లేదన్నారు. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో పథకం ప్రకారం జరిగిన కుట్రపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రధాని, రాష్ట్రపతి, గవర్నరుకు కూడా ఫిర్యాదు చేస్తానన్నారు. ‘ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’లో భాగంగా విజయనగరం వచ్చిన ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడారు. రాత్రికి పార్వతీపురం బహిరంగ సభలో ప్రసంగించారు. ఎక్కడకు వెళ్లినా తనపై హత్యాయత్నాలు జరుగుతున్నాయన్నారు. అంగళ్లు ఘటనపై తనతో పాటు దేవినేని ఉమ తదితర 20మంది టీడీపీ నేతలపై హత్యాయత్నం కేసు నమోదుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇక్కడ నాపైనే హత్యాయత్నం జరిగింది. ఇంత బహిరంగంగా దాడి చేసి తిరిగి టీడీపీ నాయకులపై దుర్మార్గంగా కేసులు నమోదు చేయడం పోలీసుల తీవ్ర వైఫల్యం. డీఐజీ, ఎస్పీపై చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్ష నేతగా ప్రజల పక్షాన.. ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, దోపిడీ, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను నిలదీసే బాధ్యత నాపై ఉంది. అంగళ్లు ప్రాంతంలో నగరి, హంద్రీ-నీవా రెండు ప్రాజెక్టుల్లో రూ.5వేల కోట్ల స్కాం జరిగింది. భూ సేకరణ, అర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీల్లో భారీగా నిధుల దుర్వినియోగం జరిగింది. ఈ స్కాంను బయటపెట్టాననే నాపై పెద్దిరెడ్డి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. హత్యాయత్నం చేశారు. ప్రభుత్వం నన్ను భయపెట్టాలని చూస్తోంది. అందుకే హత్యాయత్నం కేసు బనాయించింది. నేను భయపడి పారిపోవడమో, దాక్కోవడమో చేస్తానని భ్రమపడుతోంది. నన్ను భయపెట్టడం జగన్‌ వల్ల కాదు’ అని స్పష్టం చేశారు. ‘ప్రభుత్వ అవినీతి, అక్రమాలను నిలదీస్తా. అధికారాన్ని వినియోగించుకుని అరాచకాలు, ప్రజాధనం దోపిడీ చేస్తుంటే ప్రతిపక్ష నేతగా చూస్తూ ఊరుకోవాలా? రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తాం. అంగళ్ల ఘటనలో దోషులనుప్రజాక్షేత్రంలో నిలబెడతాం. న్యాయం ఇంకా బతికే ఉంది. సీబీఐ విచారణ జరిగే వరకు విడిచి పెట్టేదిలేదు’ అని తేల్చిచెప్పారు. ఇంకా ఏమన్నారంటే..

‘‘శాఖాపరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను అందలం ఎక్కిస్తున్నారు. ఇలాంటి పోలీసు ఉన్నతాధికారులు భయపడి వైసీపీ ప్రభుత్వానికి సరెండర్‌ అవుతున్నారు. నేను అంగళ్లు, పుంగనూరు పర్యటనకు వెళ్తే వైసీపీ వారిని ఎలా అనుమతించారు? పోలీసులు వైసీపీవారిని ఎందుకు అదుపు చేయడం లేదు? పోలీసులు ప్రభుత్వంపై తిరుగుబాటుచేసి తమ హక్కులు కాపాడుకోవాలి. టీడీపీ అండగా ఉంటుంది. మేం అధికారంలోకి వచ్చాక పోలీసుల ప్రతిష్ఠ పెంచుతాం.

చిరు మాటల్లో తప్పేంటి?

ప్రభుత్వ పనితీరుపై మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడారు. ఇందులో తప్పేముంది? దీనిపై మంత్రులు మాటల దాడులకు దిగడం ఎంత అరాచకం! వీరు చేసే అరాచకాలకు, తప్పుడు కేసులకు భయపడి పారిపోవాలా? ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే వరకు నిద్రపోను.

ఢిల్లీ వరకూ పోరు!

అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): చంద్రబాబుపై హత్యాయత్నం కేసు జగన్‌ ప్రభుత్వ అరాచకానికి పరాకాష్ఠ అని.. దీనిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని టీడీపీ నిర్ణయించింది. దీనిని ఢిల్లీ వరకూ తీసుకెళ్లి రాష్ట్రంలో ఏ స్థాయిలో అరాచకం పెరిగిపోయిందో రాజ్యాంగ సంస్థల వద్ద వివరించాలని నిశ్చయించింది. ఈ అంశంపై చంద్రబాబు బుధవారం విజయనగరంలో పార్టీ సీనియర్‌ నేతలు అశోక్‌ గజపతిరాజు, కళావెంకట్రావు, దేవినేని ఉమ, మాజీ మంత్రులు కోండ్రు మురళి, సుజయ్‌ కృష్ణ రంగారావు, టీడీపీ ఉత్తరాంధ్ర ఇన్‌చార్జి బుద్దా వెంకన్న తదితరులతో చర్చించారు. ఢిల్లీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లాలని.. ప్రధానమంత్రి, రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రితోపాటు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు తొలుత లేఖలు రాయాలని.. తర్వాత వీలు వెంట పార్టీ ప్రతినిధి బృందాలు వెళ్లి కలవాలని నిర్ణయించారు. ఇంకోవైపు.. చంద్రబాబుపై హత్యాయత్నం కేసు పెట్టడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల టీడీపీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి.

బాబాయి కేసులో ఎన్ని ట్విస్టులో?

సీఎం బాబాయి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యను చూశాం. మొదట గుండెపోటు అన్నారు.. బాత్‌రూమ్‌లో పడిపోయాడని అన్నారు. ఎన్ని ట్విస్టులు చేశారో చూశాం. బాబాయి హత్య కేసులో తమ్ముడు అవినాశ్‌రెడ్డి అరెస్టు కాకుండా శాంతిభద్రతల సమస్య సృష్టిస్తారు. సీబీఐ విధులు నిర్వర్తించకుండా అడ్డుకున్నారు. ఇంత అరాచకాన్ని ఎక్కడా చూడలేదు. ప్రజలు తిరగబడే సమయం వచ్చింది. ప్రజాస్వామ్య విలువలు మంటగలిపే అరాచక ప్రభుత్వాన్ని గద్దెదింపాలి.చంపడానికి ప్రయత్నించింది వాళ్లు..

Updated Date - 2023-08-10T03:32:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising